Home > EDUCATION > INTERMEDIATE > INTER ONLINE ADMISSIONS LINK – ఇంటర్ ఆన్లైన్ ఆడ్మిషన్ల లింక్

INTER ONLINE ADMISSIONS LINK – ఇంటర్ ఆన్లైన్ ఆడ్మిషన్ల లింక్

BIKKI NEWS (MAY 20) : Telangana intermediate online admissions 2025 link. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు నేరుగా అడ్మిషన్లు పొందేందుకు ఆన్లైన్ అడ్మిషన్ లు అందుబాటులో కలవు.

Telangana intermediate online admissions 2025 link

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు తమ 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, నచ్చిన గ్రూప్ లో నేరుగా అడ్మిషన్ పొందవచ్చు.

విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థి వివరాలు వస్తాయి.

తర్వాత జిల్లా, మండలాలను ఎంటర్ చేయడం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల లిస్ట్ వస్తుంది. అందులో తనకు నచ్చిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంచుకొని, గ్రూపు, మీడియం, సెకండ్ లాంగ్వేజ్ ఎంచుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని నమోదు చేయడం ద్వారా అడ్మిషన్ పూర్తవుతుంది. అడ్మిషన్ కు సంబంధించిన ఎకనాలెడ్జ్మెంట్ కార్డు ను ప్రింట్ తీసుకెళ్లి కళాశాలలో ప్రిన్సిపాల్ కు సమర్పించాల్సి ఉంటుంది.

INTERMEDIATE ONLINE ADMISSIONS LINK 2025