BIKKI NEWS (JAN. 02) : Telangana Inter syllabus reducing form 2025 – 26. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025 – 26 విద్యా సంవత్సరంలో పలు సబ్జెక్ట్ ల సిలబస్ ను తగ్గించే అంశాన్ని పరిశీలించడానికి సబ్జెక్ట్ నిపుణులతో కమిటీని త్వరలో నియమించినట్లు సమాచారం.
Telangana Inter syllabus reducing form 2025 – 26
సిలబస్ అధికంగా ఉండటం కూడా పిల్లల్లో ఒత్తిడి కారణమని తమ దృష్టికి వచ్చినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలను పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మరియు ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ ఉండాలని దాదాపు నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా కెమిస్ట్రీలో 30% సిలబస్ తొలగించే అవకాశం ఉంది. దీంతో దాదాపుగా ఆరు చాప్టర్లు తొలిగించనున్నారు. అలాగే ఫిజిక్స్ లో 15% సిలబస్ తొలగించనున్నారు. దీంతో మూడు చాప్టర్లు తగ్గనున్నాయి. అలాగే మ్యాథ్స్, బాటని, జువాలజీ అండ్ కూడా 5 నుండి 10% సిలబస్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఒకటి లేదా రెండు చాప్టర్లు తగ్గనున్నాయి.
సబ్జెక్టు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఏ చాప్టర్లలను తొలగించాలి మరియు ఏ చాప్టర్లో ఏ అంశాలను తొలగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి మొదటి సంవత్సరంలో నూతన సిలబస్ ప్రక్రియను అమలు చేయనున్నారు. తర్వాత విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో అమలు చేయనున్నారు.
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి
- ECIL JOBS – ఈసీఐఎల్ లో 125 కాంట్రాక్ట్ జాబ్స్