రైతు రుణమాఫీకి కీలక ఆంక్షలు ఇవే..

BIKKI NEWS (JULY 16) : telangana farmer loan waiver guidelines. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది రెండు లక్షల లోపు రుణం మాఫీ చేయడానికి ఈ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.

2018 డిసెంబర్ 12 నుండి ఆ తర్వాత మంజూరైన, రెన్యువల్ అయి… 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలు ఈ పథకం ద్వారా మాఫీ చేస్తారు.

అయితే పంట రుణమాల మాఫీ పై కీలక ఆకులను ప్రభుత్వం పెట్టింది వాటిని చూద్దాం.

Telangana farmer loan waiver guidelines

1) బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది

2) రైతు పేరు మీద ఎంత అప్పు ఉన్న గరిష్టంగా అసలు మరియు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది.

3) కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. కావున ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే రైతు రుణమాఫీ జరుగుతుంది.

4) తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తారు. దీంతో తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే రైతు రుణమాఫీ జరుగుతుంది.

5) రెండు లక్షలకు మించి రుణం ఉన్న రైతులు ఆపై ఉన్న రుణాన్ని బ్యాంకులకు చెల్లిస్తేనే రైతు రుణమాఫీ పథకం వర్తిస్తుంది.

6) బంగారు తాకట్టుపై తీసుకున్న పంట రుణాలపై మార్గదర్శకాల్లో ప్రస్తావన లేదు. దీంతో ఈ రుణాలకు మాఫీ లేనట్లే.

7) తప్పుడు పత్రాలతో మాపి పొన్నట్లు తేలితే రికవరీ చేస్తామని స్పష్టీకరణ.

8) పునర్వ్యవస్థీకరణ లేదా రీసెంట్లీ చేసిన రుణాలకు రైతు రుణమాఫీ వర్తించదు

9) కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు.

10) కేంద్రం అమలు చేస్తున్న పిఎం పిఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వ రుణమాఫీకి గాను వీలైనంతవరకు పరిగణలోకి తీసుకుంటారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు