ENGINEERING SPOT COUNSELLING – ఇంజనీరింగ్ స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (AUG. 28) : TELANGANA ENGINEERING SPOT COUNSELING 2024 SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద మిగిలిన దాదాపు పదివేల ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈసారి కన్వీనర్ కోటా కింద సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని భావించినా… చివరి క్షణంలో స్పాట్ కౌన్సిలింగ్ ను సంబంధిత కళాశాలలకు అప్పజెప్పడం విశేషం.

దాదాపు 10,099 ఇంజనీరింగ్ సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

TELANGANA ENGINEERING SPOT COUNSELING 2024 SCHEDULE

28 ఆగస్టు : స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ మరియు కళాశాల నోటీసు బోర్డులో ఖాళీల వివరాల వెల్లడి

29 ఆగస్టు : ప్రముఖ దిన పత్రికల్లో నోటిఫికేషన్లు ప్రచురణ

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 02 వరకు : స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాల నిర్వహణ

సెప్టెంబర్ 03 : ప్రవేశాలు పొందిన అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి

సెప్టెంబర్ 04 : ప్రవేశాలు పొందిన అభ్యర్థుల దృవపత్రాలను మాసబ్ ట్యాంక్ లోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు