BIKKI NEWS (SEP. 20) : Telangana DSC Result 2024. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం.
Telangana DSC Result 2024
సెప్టెంబర్ 6వ తేదీన డీఎస్సీ పరీక్షల తుది ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిసి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్) ను ఇవ్వాల్సి ఉంది.
వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని తుది కీ విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా.. ఇంతవరకు విడుదల చేయకపోవడం విశేషం.
తుది ‘కీ’ వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. అయినా జీఆర్ఎల్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావొచ్చని సమాచారం.
డీఎస్సీ తుది కీ విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పులతడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవర ణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీతో ముగిసింది.
జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబి తాను డీఈవోలకు పంపించాల్సి ఉంటుంది. కానీ, జీఆర్ఎల్ ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.