Home > JOBS > TELANGANA JOBS > Telangana Jobs – తెలంగాణలో రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లు

Telangana Jobs – తెలంగాణలో రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లు

BIKKI NEWS (JULY 08) : Telangana coming job notification 2025 – 26. తెలంగాణ రాష్ట్రంలో 2025 – 26 సంవత్సరాలలో వెలువడే అవకాశం ఉండి, ఉద్యోగార్థుల సన్నద్ధత కోసం ఉపయోగకరమని భావించి వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది.

Telangana coming job notification 2025 – 26.

తాజాగా ఎమ్మెల్సీ కోదండరాం సీఎం, డిప్యూటీ సీఎం లతో సమావేశమై జాబ్ కేలండర్ ను వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు. అలాగే వెంటనే భర్తీ చేయగల ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జాబ్ కేలండర్ అప్డేట్ చేసి విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్ ల వివరాలు ఇవ్వడం జరిగింది.

అంగన్వాడీ ఉద్యోగాలు: 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.

ఆర్టీసీ ఉద్యోగాలు : 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది

పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు : ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడయ్యే అవకాశం

బీట్ ఆఫీసర్ పోస్టులు : బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు.

గురుకులాల్లో పోస్టులు: గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం

డిగ్రీలెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు: ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది

సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టులు: సింగరేణి కాలరీస్ మరియు ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు రావచ్చు.

టీచర్ పోస్టులు: టెట్ పరీక్షపూర్తయిన తర్వాత, మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు..

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు

జేఎల్ పోస్టులు : నూతనంగా ఏర్పడిన జూనియర్ కళాశాలల్లో దాదాపు 200 కి పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు