BIKKI NEWS (SEP. 20) : TELANGANA CABINET DECISIONS ON 20th SEPTEMBER 2024. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
TELANGANA CABINET DECISIONS ON 20th SEPTEMBER 2024
హైడ్రా కు చట్టబద్ధత
హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
యూనివర్సిటీలకు పేరు మార్పు
మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారుపైనా చర్చ. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. మూడు యూనివర్సిటీల పేర్లకు ఆమోదం తెలపిన మంత్రివర్గం.
ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో విలీనం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు. ఆర్అండ్్బ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వరయంలో 12 మందితో కమిటీ. కమిటీ కన్వీనర్ గా ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ.
పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ ఎస్పీఎల్ కు కూడా వర్తింపు.
మనోహరాబాద్లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం. 3 వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్.
ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం.
ఏటూరునాగారం ఫైర్ స్టేషను 34 మంది సిబ్బంది మంజూరు.
కోస్గి ఇంజినీరింగ్ కళాశాల, హకీం పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు. పోస్టులు మంజూరు
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు రూ.4,637 కోట్లు మంజూరు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఏజెన్సీకి ఆదేశం.
ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్పీకి అదనంగా రూ.500 చెల్లించి సన్నాలు కొనుగోలు చేయాలని నిర్ణయం. ఈ ఖరీఫ్లో 1.43 లక్షల టన్నుల పంట వస్తుందని అంచనా.
అక్టోబరు నుంచి కొత్తగా తెల్ల రేషన్ కార్డుల జారీ. జనవరి నుంచి అన్ని రేషన్కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తాం.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని మూడు ప్రధాన విద్యా సంస్థలకు ప్రముఖుల పేర్లను ఖరారు చేసింది. హైదరాబాద్ కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి సాంఘిక, సాహిత్యోద్యమ నేత సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును, కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్వతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును మంత్రిమండలి నిర్ణయించింది.
హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించడం.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది.
కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం.
కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయడం.
హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతి.
ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్.
రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు.
ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమును ఎస్పీఎఫ్‌కు కూడా వర్తింపజేయడం.
తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూమి కేటాయింపు.
ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాల భూమి కేటాయింపు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు.
రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3 వేల పోస్టుల మంజూరు
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి రైతుల చిరకాల కోరికను నెరవేర్చడం.
కోస్గి ఇంజనీరింగ్ కాలేజీకి, హకీంపేటలో జూనియర్ కాలేజీకి అవసరమైన పోస్టులు మంజూరు.