BIKKI NEWS (SEP. 20) : telangana cabinet approved ration cards issuing. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 02 నుండి నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
telangana cabinet approved ration cards issuing
ఈ మేరకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
అక్టోబర్ 02 నుండి పౌరుల నుండి దరఖాస్తు స్వీకరించాలని అనంతరం అర్హులైన వారిని గుర్తించి వెంటనే డిజిటల్ రేషన్ కార్డులను కూడా జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే జనవరి 2025 నుండి అన్ని రకాల రేషన్ కార్డు దారులకు సన్న బియాన్ని సరఫరా చేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో నాణ్యమైన సన్న రేషన్ బియ్యం పౌరులకు సరఫరా చేయనున్నారు.