- వ్యాసకర్త అస్నాల శ్రీనివాస్
BIKKI NEWS : స్వాతంత్ర్యానంతరం భారతావని విద్య, జ్ఞాన జ్వాలలను ప్రసరింపజేసిన చింతనాపరుడు, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆధునిక విద్యా దార్శనికుడు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవన పర్యంతం విసుగులేని జ్ఞాన తృష్ణతో భారతీయతలోని ప్రజాహిత అంశాలను అన్వేషించి, వెలికితీసి ప్రపంచానికి చాటారు. ప్రజాతంత్ర విద్యతో లబించే మానవీయ సమాజ నిర్మాణ కృషిలో గడిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తిరుత్తని గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి కుటుంబంలో 1888, సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు. విద్యార్థి దశ నుంచే భారతీయ చింతన, సాహిత్యం, సంస్కృతి, కళలపై మమకారం ఏర్పర్చుకొని భారత విద్యావికాసానికి పాటుపడిన గొప్ప స్వాప్నికుడు సర్వేపల్లి రాధాకృష్ణన్.
సర్వేపల్లి తన పాఠశాల విద్యను తిరుత్తని, తిరుపతిలో పూర్తిచేశారు. తత్త్వశాస్త్రంలో ఉన్నత విద్యను మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో పూర్తిచేశారు. భారతీయ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, బౌద్ధ వాజ్మయాలపై అవగాహన లేని పాశ్చాత్య పండితుల అపహాస్యపు సంకుచిత విమర్శలకు సమాదానంగా విద్యార్థి దశలోనే పారా భౌతిక వాస్తవికతలలో వేదాంతనీతి’ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించి భారతీయ చింతనపై తన లోతైన అవగాహనను ప్రపంచానికి తెలియజేశారు. సర్వేపల్లి తన బోధనా వృత్తిని 1909లో ప్రారంభించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా కూశా ల, మైసూర్ కళాశాలల్లో పనిచేశారు. 1948లో బనారస్ హిందూ విశ్వ విద్యాయాలనికి ఉపకులపతిగా సేవలందించి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 1948-1952 కాలంలో యునెస్కో లో భార త ప్రతినిదిగా, రష్యా రాయబారిగా పనిచేశారు. రాజనీతిజ్ఞుడిగా స్వతంత్ర భారత తొలి ఉప రాష్ట్ర, రెండో రాష్ట్రపతిగా పనిచేశారు.
‘ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగించడం, వ్యక్తుల వికాసానికి, జీవితానికి తోడ్పడుతూ సృజనాత్మక సమాజ నిర్మాణమే విద్య లక్ష్యం’ – అస్నాల శ్రీనివాస్
విద్యా దార్శనికుడిగా ‘ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగించడం, వ్యక్తుల వికాసానికి, జీవితానికి తోడ్పడుతూ సృజనాత్మక సమాజ నిర్మాణమే విద్య లక్ష్యం’ గా ప్రకటించాడు. ఇంకా విద్య వివేచనను, సమతుల్యతను, మంచి చెడుల విచక్షణను కలిగిస్తుందని చెబుతూ ఒక దేశం ఆ దేశ విద్యాసంస్థల్లో నిర్మాణమవుతుందన్నాడు. ఆ విద్యాసంస్థలు.. ‘భయమంటే తెలియని, అన్యాయాన్ని సహించని నైపుణ్యం, సామర్థ్యం, దృక్పదం, సాహసం, విలువలతో కూడిన విద్యా ర్డులను తయారుచేయాల ని ఉద్బోధించారు. ఆ దిశగా విద్యాసంస్థలను వీర్చిదిద్దారు. సంపదను పెంచుకోవటానికి అసమానతలు తగ్గించటానికి, సామాజికంగా, ఆర్థికంగా, జీవన ప్రమాణాలను పెంచటానికి ఉజ్వల భారతదేశాన్ని నిర్మించటానికి విద్యను ముఖ్య సాధనంగా చోదక శక్తిగా చేసుకోవాలన్నాడు. విద్యాసంస్థల్లో వాణిజ్య దృక్పథం అసమానతల సమాజానికి అనేక దుష్ఫలితాలకు దారితీస్తుందని ఆనాడే హెచ్చరించారు. సత్వాన్వేషణ, సహనం, శ్రద్ధాసక్తులు పక్షపాతం లేకుండా ఉండడం, శ్రమపై ప్రేమ పంటి విలువలను విద్య పెంపొందించాలి. విజ్ఞానశాస్త్ర ఫలాలు ముందెన్నడూ లేని భౌతిక సౌఖ్యాన్ని విరామకాలాన్ని ప్రజలకు కల్పించింది. ఆదే సమయంలో మారణాయుధాలు, ప్రపంచ యుద్దాలు మానవ ప్రగతిని ప్రశ్నార్ధకు చేస్తున్నా యి. ఈ అపశృతులను తొలిగించడానికి విద్యా సంస్థల్లో సామాజిక, నీతి శాస్త్రాల బోధన తప్పని సరి చేయాని సూచించారు.
సంపదను పెంచుకోవటానికి అసమానతలు తగ్గించటానికి, సామాజికంగా, ఆర్థికంగా, జీవన ప్రమాణాలను పెంచటానికి ఉజ్వల భారతదేశాన్ని నిర్మించటానికి విద్యను ముఖ్య సాధనంగా చోదక శక్తిగా చేసుకోవాలి – అస్నాల శ్రీనివాస్
రాధాకృష్ణకు సాహిత్యం, కళలపై ప్రత్యేక అభినివేశం ఉండేది. స్వేచ్ఛ మానవుడి క్రమశిక్షణాయుత ఉన్నత అబిరుచులు, సృజనాత్మక వ్యక్తీకరణ కళ అని భావించారు. 1952లో ఆలంపూర్ లో దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సాహిత్య సదస్సులో ముఖ్య ఆతిథిగా పాల్గొన్నారు.
భారతీయ చింతనా సారస్వతంతో పాటు ప్రపంచ దేశాల మహాకావ్యా లు, కళలు, దర్శనాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రాక్-పశ్చిమ తత్వ శాస్త్రాలకు వారధిగా పనిచేసి వాటిని సమకాలీన, సామాజిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యానించారు. తత్వశాస్త్ర ప్రధాన శాఖలైన మెటా ఫిజిక్స్, లాజిక్, ఎపిస్టోమాలజీ, ఎథిక్స్, సైకాలజీల అధ్యయనాల తో ప్రపంచ మానవాళిలో సామాజిక స్పూర్తి రగిలించారు. తన అధ్యయనాలను, అనుభవాలను, పరిశీలనలను గ్రంధాలుగా ప్రచురించారు. వీటిలో భారతీయ తత్త్వశాస్త్రం, ఐడియలిస్ట్ వ్యూ అప్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, దమ్మపద, రిలీజియన్ అండ్ సైన్స్, రికవరీ ఆఫ్ ఫెయిత్ లు విస్తృత ప్రాచుర్యం పొందాయి.
దేశ ప్రగతి లో కీలకమైన విద్యా అభివృద్ధికి సూచనలు చేయ వల్సిందిగా కోరుతూ 1948 లో సర్వేపల్లి రారా కృష్ణన్ అధ్యక్షతన మొదటి విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్ సూచనలకు భారత విద్యా చరిత్రలో చాలా ప్రాధాన్యం ఉన్నది. విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలుగా భాసిల్లాలని, నూతన ఆవిష్కరణలు చేయాలని, దేశం స్వావలంబన దిశగా, సార్వభౌమ స్వతంత్ర దేశంగా రూపొందడానికి కావాల్సిన విద్యా విదానాన్ని సిఫార్సు చేసింది. కళాశాలల సంఖ్య పెరుగాలని, విద్యా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యపై వ్యయాన్ని ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడిగా భావించాలని ప్రభుత్వానికి సూచించారు.
విద్యా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యపై వ్యయాన్ని ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడిగా భావించాలని ప్రభుత్వానికి సూచించారు. – అస్నాల శ్రీనివాస్
ఉపాధ్యాయులు సమాజంలో అత్యున్నత మేధోజీవులు. చరిత్రను మలుచడంలో, సామాజిక పునర్నిర్మాణంలో దారిచూసే దార్శనికులు ఉపాధ్యాయులకు బోధనాంశాల పట్ల ప్రేమ. తమ చేతుల్లో విద్యార్థులు ఎదుగాలనే ఆకాంక్ష ఉండాలని తను ఆచరించి తోటి ఉపాధ్యాయ లోగా నికీ ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉన్న ప్పుడే విద్యార్థులు తమలోని స్వేచ్ఛను, మార్మికతను, భావావేశాలను, మేధోపరమైన కార్యకలాపాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వాలకు తెలియజేసి అమలు చేయించారు.
ప్రస్తుతం దేశ విద్యావ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తే సర్వేపల్లి దార్శనిక స్ఫూర్తికి భిన్నమైన ఆందోళనకరమైన స్థితి నెలకొని ఉన్నది. దేశంలో ఉన్న 15 లక్షల పాఠశాలల్లో నుంచి 10వ తరగతిలలో 26 కోట్ల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే 1000 పైగా ఉన్న విశ్వవిద్యాలయాలు, 34,852 వేల కళాశాలల్లో 3 కోట్ల మంది విద్యార్థులు ఉన్నచ విద్యను అభ్యసిస్తున్నారు. 80 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యా సంస్థలు 70 శాతం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. వీటిలో 80 శాతం విద్యా సంస్థలు నేలబారు ప్రమాణాలతో కునారిల్లుతున్నాయి. మానవ సమాజ సమిష్టి సంపద జ్ఞానాన్ని వ్యాపారం చేయడంతో మానవ విలువలు ద్వసం అవుతున్నాయి. జీడీపీలో విద్యపై వ్యయం 3 శాతం కూడా మించడం లేదు. జాతీయ నమూనా సర్వే గణాంకాల ప్రకారం దళితులు ఆదివాసీలు, మైనార్టీ వర్గాల్లో డ్రాపౌట్లు, నిరక్షరాస్యత ఎక్కువ ఉందని తెలియజేస్తున్నాయి.
జీడీపీలో విద్యపై వ్యయం 3 శాతం కూడా మించడం లేదు. జాతీయ నమూనా సర్వే గణాంకాల ప్రకారం దళితులు ఆదివాసీలు, మైనార్టీ వర్గాల్లో డ్రాపౌట్లు, నిరక్షరాస్యత ఎక్కువ ఉందని తెలియజేస్తున్నాయి. – అస్నాల శ్రీనివాస్
అందరికీ గుణాత్మక విద్యను అందించినప్పుడే అభివృద్ధి పలాలు అందరికి అంది మానవాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపద్యంలో సర్వేపల్లి విద్యాదృక్పథానికి ప్రాసంగికత ఉన్నది. ఆ మహనీయుడి బాటలో ప్రభుత్వ విద్య పెరగాలి. వ్యాపారమయ విద్య తరగాలి. వైజ్ఞానిక భారతావని రూపొందాలి.