DSC 2024 – నేడే ఉపాద్యాయ నియామక పత్రాలు అందజేత

BIKKI NEWS (OCT. 09) : Teachers appointment orders issuing today . తెలంగాణ డీఎస్సీ 2024 లో ఎంపికైన అభ్యర్థులకు ఈరోజు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది.

Teachers appointment orders issuing today

ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

ఇప్పటికే డీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులంతా ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.

ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలిచ్చేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 200 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

నియామక పత్రాలు అందజేసిన అభ్యర్థులకు ఈ నెలలోనే పోస్టింగ్ ఇచ్చి పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు