T20 RECORD CHASE – టీట్వంటీ లలో రికార్డు చేజింగ్

సెంచూరీయన్ (మార్చి – 26) : వెస్టిండీస్ దక్షిణాఫ్రికా జట్ల మద్య జరిగిన 2వ T20లో సౌతాఫ్రికా జట్టు సంచలనం నమోదు చేసింది. T20ల్లో అత్యధిక రన్స్ చేధించిన జట్టుగా నిలిచింది. T20 RECORD CHASING

తొలుత 20 ఓవర్లలో విండీస్ 258/5 రన్స్ చేయగా.. సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 259/4 రన్స్ చేసి ఈ రికార్డును సాధించింది. గతంలో ఆస్ట్రేలియా చేసిన 244 రన్స్ అత్యధికం. అలాగే T20ల్లో 10 ఓవర్లలో 149/0 రన్స్ చేసిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి 10 అత్యధిక రన్స్ చేసిన జట్టుగా నిలిచింది. ఇరుజట్లు కలిసి 517 పరుగులు చేయడం విశేషం.

క్వింటన్ డికాక్ అంతర్జాతీయ టీట్వంటీ లలో తొలి సెంచరీ (44 బంతుల్లో 100*) చేసి సౌతాఫ్రికా ను గెలిపించాడు.