BIKKI NEWS (SRP. 21) : Swacchata sewa programme in gjc girls husnabad. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుపుతూ మొక్కలు నాటడం మరియు నాటిన మొక్కలను పరిరక్షించుకున్నప్పుడు పర్యావరణం అభివృద్ధి చెందుతుందని సూచించారు. అలాగే ప్రజలందరూ సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాలలోని చెత్తాచెదారాలను తొలగించి ప్లాస్టిక్ వర్గాలను మరియు ముళ్ళ చెట్లను తొలగించారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి ఎన్ఎస్ ఎస్పిఓ శ్రేడి కరుణాకర్ మరియు కళాశాల అధ్యాపక బృందము అధ్యాపక ఇతర బృందం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి మొక్కను నాటి, చెట్లకు పాదులు చేసి నీటిని పోయడం జరిగింది. ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డి కరుణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందము డి రవీందర్, ఎస్ సదానందం, బి లక్ష్మయ్య, ఏ సంపత్, నిర్మలాదేవి, ఎస్ కవిత, జి కవిత, పి రాజేంద్రప్రసాద్ అధ్యాపకేతర బృందం రాములు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.