EV SUBJECT : పాలిటెక్నిక్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై సబ్జెక్ట్

హైదరాబాద్ (మే – 07) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక సబ్జెక్టును ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈవీపై సబ్జెక్టును ప్రవేశపెడతారు.

తెలంగాణ రాష్ట్రంలో 85కు పైగా ఈవీ కంపెనీలున్నాయి. వీటిలో కొన్ని తయారీ సంస్థలు ఉండగా, మరికొన్ని సర్వీస్
స్టేషన్లు, చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. భవిష్యత్తులోను మరికొన్ని సంస్థలు ఏర్పాటయ్యే అవకాశమున్నది. వీటి ఏర్పాటుతో ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
లభించనుండ టంతో మన విద్యార్థులు ఆయా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో ఎలక్ట్రిక్ వాహనాల సబ్జెక్టును ప్రవేశ పెట్టనున్నారు.

◆ ఈవీ విద్యావకాశాలు :

  • పాలిటెక్నిక్ లోని మెకానికల్, ఆటో మొబైల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లోని విద్యార్థులు తమ 5వ సెమిస్టర్ ఈవీని ఒక సబ్జెక్టుగా తీసుకోవచ్చు.
  • ఈ సబ్జెక్టుల బోధనపై ఇటీవలే విద్యానగర్ లోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ లో పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లకు మొదటి దఫా శిక్షణ ఇచ్చారు. జూలైలో మరోవిడుత శిక్షణ ఉంటుంది.
  • ఈ సబ్జెక్టు తీసుకొన్న విద్యార్థులు ఈవీ పరిశ్రమల్లో ప్రాక్టికల్స్ (ఇంటర్నిషిప్) చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు సైతం విద్యానగర్ ఏటీఐలో శిక్షణ పొందుతారు.