Home > EDUCATION > NEET UG > NEET UG RESULTS – నీట్ యూజీ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే

NEET UG RESULTS – నీట్ యూజీ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే

BIKKI NEWS (MAY 18) : STAY ON NEET UG RESULTS 2025. మద్రాస్ హైకోర్టు నీట్ యూజీ 2025 ఫలితాలపై స్టే విధించింది.

STAY ON NEET UG RESULTS 2025

తమిళనాడులోని ఓ పరీక్షా కేంద్రంలో నీటి యుజీ పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా అసౌకర్యం కలిగిందని, ఆ కారణంగా ఫలితాల విడుదల నిలిపేయాలన్న అభ్యర్థన మేరకు మద్రాస్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నైలోని ఓ పరీక్షా కేంద్రంలో ఆరోజు భారీ వర్షం కారణంగా దాదాపు 75 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పరీక్ష కేంద్రంలో ఎలాంటి జనరేటర్, ఇన్వర్టర్ లేదు. దీనివలన తమ విలువైన సమయాన్ని కోల్పోయామని 13 మంది అభ్యర్థుల తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమకు ఎలాంటి అదనపు సమయాన్ని అధికారులు కేటాయించలేదని… దీంతో మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయామని వీళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చూస్తే ఇతర కేంద్రాల్లోని అభ్యర్థులతో పోలిస్తే వీళ్లకు సమాన అవకాశాలు, హక్కులు లభించలేదు… అందుకే ఈ విషయం తేలే వరకు పరీక్ష ఫలితాలు నిలిపివేయాలని అభ్యర్థుల తరఫున లాయర్ వాదించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు