SSC CHSL 2023 FINAL KEY

న్యూడిల్లీ (అక్టోబర్ – 17) : SSC CHSLE 2023 TIER 1 EXAM FINAL KEY RELEASED. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 1,762 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2023 (టైర్-1) సమాధానాల తుది కీని అక్టోబర్ 17న విడుదల చేసింది.

ఆగస్టులో సీహెచ్ఎస్ఎస్ఈ టైర్-1 పరీక్ష.నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి సమాధానాల కీతో పాటు ప్రశ్నపత్రాలను చూసుకోవచ్చు.

వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి మే నెలలలో ఎస్ఎస్సి
నోటిఫికేషన్ విడుదల చేసింది.

టైర్-1, టైర్-2 పరీక్షలు, కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://ssc.nic.in