Home > SPORTS > IPL > IPL 2024 – రికార్డుల మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం

IPL 2024 – రికార్డుల మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం

BIKKI NEWS (APRIL 20) : IPL 2024 లో భాగంగా డిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 67 పరుగుల తేడాతో ఘనవిజయం (SRH BEATS DC IN IPL 2024) సాదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్ – 89, షాబాజ్ అహ్మద్ – 59*, అబిషేక్ శర్మ – 46, నితీష్ రెడ్డి- 37 పరుగులతో రాణించడంతో 20 ఓవర్ లలో 266/7 పరుగులు చేసింది. కులదీప్ యాదవ్ – 4 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన డిల్లీ జట్టు మెక్ గుర్క్ – 65, పంత్ – 44, పొరెల్ – 42 పరుగులతో రాణించిన భారీ స్కోరు చేధించలేకపోయారు. 19.1 ఓవర్ లలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యారు. నటరాజన్ – 4, మార్కండే – 2, నితీశ్ రెడ్డి – 2 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ లో ఫ్రేజర్ మెక్ గ్రూక్ ఈ ఐపీఎల్ లోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని 15 బంతుల్లో నమోదు చేశారు. అలాగే హెడ్ 16 బంతుల్లో అర్ధ సంచరీ నమోదు చేయడం విశేషం,

అత్యంత వేగంగా 5 ఓవర్ లలోనే టీమ్ 100 పరుగులు చేయడం ద్వారా హైదరాబాద్ జట్టు రికార్డు సృష్టించింది.

అలాగే పవర్ ప్లే లో అత్యధిక పరుగులు 125 చేయడం ద్వారా కేకేఆర్ పేరు మీద ఉన్న 105 పరుగుల రికార్డు బ్రేక్ అయింది..

పవర్ ఫ్లే లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ట్రావిస్ హెడ్ (84) నిలిచాడు.

ఈ మ్యాచ్ లో కూడా హైదరాబాద్ జట్టు 22 సిక్స్ లు కొట్టడం విశేషం. ఇదే సీజన్ లో 22 సిక్స్ లు కొట్టడం రెండోసారి.