మానవ పెట్టుబడిని విస్మరించిన కేంద్ర బడ్జెట్ – అస్నాల శ్రీనివాస్

  • special-essay-on-union-budget-2023-by-asnala-srinivas

BIKKI NEWS : అంతర్జాతీయంగా అన్ని అభివృద్ధి సూచికలలో అగ్రగామిగా ఉన్నామనే అబద్ధాలను అందంగా ప్రస్తావిస్తూ బడ్జెట్ ను1 ఫిబ్రవరి న నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని రుణాల కుప్పగా మార్చింది. మానవ జీవితం అభివృద్ధి ని పెంచకపోగా మరింత కుంగతీసింది. సంపన్న ఆర్ధిక వ్యవస్థ దేశాల జాబితాలో 5వ స్థానం అనే వెలుగులో మానవ జీవన ప్రమాణ సూచిక లో 132 వ అధమ స్థానము అనే నీడ ను విస్మరించింది. ప్రపంచ పేదలలో ప్రతి 5గురిలో 4గురు భారత్ లోనే ఉన్నారు. ఉద్యోగ కల్పన లేని ఆర్ధిక వ్యవస్థతో నడిచే రాజకీయాలకి మోడీ నడుపుతున్నారు మానవ జీవన ప్రమాణాలను పెంచడంలో, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో వైఫల్యం చెందింది.

గత 9 ఏండ్ల మోడీ పాలన 114 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని రుణాల కుప్పగా మార్చింది. – అస్నాల శ్రీనివాస్

రూపాయి రాకలో 30% అప్పుల నుండి పోకలో 20% వడ్డీల చెల్లింపుల దుస్థితికి దేశాన్ని నెట్టి వేశారు. ఆర్షికాభివృద్ధికి సాంకేతిక జ్ఞాన శాస్త్రాలు, ఆరోగ్యం చోదక శక్తులుగా పని చేస్తాయని చెప్తూ వాటికి జిడిపి లో 6%, 1% నిధులు ఇవ్వాల్సి ఉండగా పావు శాతం కూడా కేటాయించలేదు.

రూపాయి రాకలో 30% అప్పుల నుండి పోకలో 20% వడ్డీల చెల్లింపుల దుస్థితికి దేశాన్ని నెట్టి వేశారు. – అస్నాల శ్రీనివాస్

నూతన విద్యా విధానం 2020 ఊదరగొట్టిన మోడీ ఆచరణలో జిడిపి లో 0.60% అనగా 1.12 లక్షల కోట్లు ఇచ్చారు. కరోనా మహమ్మారి వలన దిగువస్థాయి ప్రవేట్ బడులు మూతబడ్డాయి. విద్యార్థులలో అభ్యసన స్థాయిలు పడిపోయాయి. దీనిని భర్తీ చేయటానికి రెమిడీయల్ తరగతుల నిర్వహణ అవసరం. annual status of education report ప్రకారం ప్రభుత్వ బడులలో నమోదు శాతం అనుహ్యంగా పెరిగింది. మౌలిక సౌకర్యాల కల్పన టీచర్స్ పోస్ట్ ల భర్తీ కి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన సందర్భంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ప్రజల హక్కుగా ప్రభుత్వ విద్య అనే రాజ్యాంగ స్ఫూర్తి ని ఉల్లఘించారు.85% పిల్లలో మెదడు వికాసం 6ఏండ్లు లోపల జరుగుతుంది.ఈ ప్రక్రియలో అంగన్ వాడీల పాత్ర కీలకం.ఈ రంగానికి నిధులను తక్కువ చేసింది.

మానవ ఆరోగ్య సూచికలో భారత్ 179వ స్థానంకు చేరుకుంది. జిడిపిలో 3% నిధుల హామీని విస్మరించి కేవలం 0.36% మాత్రమే ఇచ్చింది. – అస్నాల శ్రీనివాస్

విద్య ఉమ్మడి జాబితా లో అంశం.రాష్ట్రాలకి కేటాయింపులు కనిష్ట స్థాయికి చేరాయి. దీనితో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
యూనివర్సిటీల నిర్వహణ లో వెనుకబడిపోతున్నాయి.
అంతరిక్ష మరియు అన్ని సాంకేతిక పరిశోధన సంస్థలకి నిధుల్లో భారీ కోత విధించింది. ఆదివాసి దళిత మైనారిటీల పై కక్ష్యా పూరిత ధోరణులు ఈ బడ్జెట్ లో కనిపించాయి. వీరికి
వృత్తి విద్యా కోర్సులలో ఇచ్చే ఉపకార వేతనాల బడ్జెట్ లో 38% భారీ కోతను విధించారు .దీనితో సృజనాత్మక నైపుణ్య పౌరులను రూపొందించాలన్న ప్రక్రియ అభ్యసనలో ఆర్ధిక వృద్ధి ప్రతి ఒక్కరికి చేరువ చేస్తామనే మోడీ హామీ ఒక డొల్లగా మారింది.

2022-23 బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే ఈ సారి ఎరువుల సబ్సిడీ 13%తగ్గించారు.ఆహార సబ్సిడీ కి 2.48%, వ్యవసాయ దాని అనుబంధ రంగాలకి 4% నిధులను తగ్గించారు. – అస్నాల శ్రీనివాస్

మానవ ఆరోగ్య సూచికలో భారత్ 179వ స్థానంకు చేరుకుంది. జిడిపి లో 3% నిధుల హామీని విస్మరించి 88956 కోట్లను అనగా జీడీపీలో 0.36% మాత్రమే ఇచ్చింది.ప్రవేట్ వైద్య ఖర్చుల వలన ప్రతి ఏటా ఆరు కోట్ల ప్రజలు పేదరికంలోకి వెళుతున్నారు.ఆయుష్మాన్ భారత్ పథకంలో రెండవ మూడవ స్థాయి వైద్య స్థాయికి మాత్రమే 5లక్షల సహాయం ఉంది.దీనిని మొదటి స్థాయి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు విస్తరింపచేసి 70% నిధులను ఇవ్వాలి. ప్రతి పది వేల మందికి 20 పడకలు ,24 ఆరోగ్య సిబ్బంది ఉండాలని జాతీయ ఆరోగ్య విధానం 2017 నిర్దేశించింది. దీనిపై చిత్త శుద్ధి లేని మోడీ గ్రామీణ ప్రజల జీవనరేఖ గా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

మౌళిక సౌకర్యాల కల్పన కోసం ఇచ్చిన 10లక్షల కోట్ల నిధులు తన తన తాబేదార్లు గా ఉండే కార్పొరేట్ల కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది. రైతుల ఉసురు తీస్తూ వచ్చిన మోడీ ఈ సారి 20లక్షల కోట్ల రుణ సౌకర్యం కల్పన చేస్తామని చెప్పడం విడ్డురంగా ఉంది.మరొక సారి రైతులను వంచన మభ్యపెట్టేదిగా ఉంది. 2022-23 బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే ఈ సారి ఎరువుల సబ్సిడీ 13%తగ్గించారు.ఆహార సబ్సిడీ కి 2.48%, వ్యవసాయ దాని అనుబంధ రంగాలకి 4% నిధులను తగ్గించారు. వీటి వలన రైతాంగ జీవనం మరింత సంక్షోభంలోకి నెట్టి వేశారు.దీనికి తోడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 33%నిధులు తగ్గించి సన్నకారు రైతుల,కూలీల పై వికృత సర్జికల్ దాడి చేశారు.

భారత ఆర్ధిక వ్యవస్థ 1950-2014 వరకు ఆనాటి ప్రపంచ ఆర్ధిక పోకడలతో పోల్చినప్పుడు మెరుగైన ఫలితాలను కనపర్చింది.మోడీ 9ఏండ్ల పాలనలో ఆ క్రమాన్ని కొనసాగించడంలో వెనుకబడింది. – అస్నాల శ్రీనివాస్

ఆదాయ మార్గాన్ని వారి కొనుగోలు శక్తిని పెంచే ఉపాధి హామీ పథకంను 2014 నుండి నిర్వీర్వ్యం చేస్తూ వచ్చారు. వంద రోజుల పని కల్పనకి 2.72లక్షల కోట్ల నిధులు అవసరం. గత 9ఏళ్లలో 45-48 పని దినాలు కల్పన మాత్రమే జరిగింది. 40రోజుల పని కల్పనకి 1.24లక్షల కోట్లు అవసరం. కానీ ఈ బడ్జెట్ లో 60వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.90%శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో ఉంది.దేశ స్థూల జాతీయోత్పత్తిలో వీరి వాటా 50% ఉంది.వీరి సామాజిక భద్రత 16893 కోట్ల నుండి 13221 కోట్ల కు తగ్గించారు.వీరికి అందించే 10లక్షలు విలువ గల భీమా యోజన ఆపివేశారు.

భారత ఆర్ధిక వ్యవస్థ 1950-2014 వరకు ఆనాటి ప్రపంచ ఆర్ధిక పోకడలతో పోల్చినప్పుడు మెరుగైన ఫలితాలను కనపర్చింది.మోడీ 9ఏండ్ల పాలనలో ఆ క్రమాన్ని కొనసాగించడంలో వెనుకబడింది. గంభీరంగా ఉదాత్త పదాలతో అమృత కాలంలో జాతీయోద్యమ వీరుల ఆశల ప్రతిఫలిస్తున్నదని చెప్పుకున్నది.సమీకృత అభివృద్ధి ,ప్రతి ఒక్కరికి చేరువ కావడం,మౌలిక వసతుల కల్పన , సామర్ష్యాలను ఆవిష్కారించడం ,గ్రీన్ గ్రోత్ ,యువ శక్తి ,ఆర్ధిక సామర్ధ్యం అని బిజెపి ప్రవచించిన సప్త రిషి సూత్రం కాగితాలకే పరిమితం చేసుకుంది.ప్రభుత్వ రంగాన్ని తగ్గించి కార్పొరేట్ శక్తులను పెంచడానికి మోడీ బడ్జెట్ తోడ్పడుతున్నది.సంపద బొట్లు బొట్లుగా జారే సిద్ధాంతాని వదిలి కేంద్రీకృతం చేయడంలో సఫలమైంది.ఇదే ఫాసిజము కు అవసరం ప్రజాస్వామ్యానికి ప్రమాదం.

అస్నాల శ్రీనివాస్, ప్రిన్సిపాల్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.