జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దు – హైకోర్టు

హైదరాబాద్ (ఆగస్టు – 29) : సింగరేణి సంస్థలు 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 2022లో నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షను రద్దు (Singareni junior assistant exam cancelled by TS High Court) చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.

నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతూ ఒక అభ్యర్థి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇన్ని రోజులు వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడటం ఆలస్యమైంది. తాజా హైకోర్టు తీర్పుతో నియామక పరీక్ష మరియు నోటిఫికేషన్ రద్దు అయింది.