SUSPENSION – ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

BIKKI NEWS (AUG. 20) : Siddipet Ex DIEO Himabindu Suspended. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సిద్దిపేట జిల్లాలోని మాజీ డిఐఈఓ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సిద్దిపేట గర్ల్స్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న హిమబిందు ను సస్పెన్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Siddipet Ex DIEO Himabindu Suspended.

ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తూ మరియు షోకాజ్ నోటీస్ కు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది.

సాధారణ బదిలీలకు ముందు సిద్దిపేట డిఐఈఓ గా ఉన్న హిమబిందు బదిలీల అనంతరం ఆమె కంటే సీనియర్ రవీందర్ రెడ్డి బదీలీలలో భాగంగా సిద్దిపేట జిల్లాకి రావడంతో సర్వీసు రూల్స్ ప్రకారం జిల్లాలో సీనియర్ అయిన రవీందర్ రెడ్డి కి నూతన డీఐఈవో గా నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే హిమబిందు నూతన డిఐఈఓ కి చార్జ్ అప్పగించకపోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేసింది. షోకాజ్ నోటీసు కు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు