Home > ESSAYS > SHIMLA AGREEMENT – సిమ్లా ఒప్పందం పూర్తి వివరణ

SHIMLA AGREEMENT – సిమ్లా ఒప్పందం పూర్తి వివరణ

BIKKI NEWS : Shimla agreement full story in telugu. సిమ్లా ఒప్పందం భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య 1972 జూన్ 2న కుదిరింది. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధానంతరం ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కుదిరింది.

Shimla agreement full story in telugu

1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంతో తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్ పేరుతో నూతన దేశంగా ఏర్పడింది.

ఈ సిమ్లా ఒప్పందం మీద భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో సంతకాలు చేశారు.

సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.

ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాలు శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలని, లైన్ ఆఫ్ కంట్రోల్ ను ఇరుదేశాలు గౌరవించుకోవాలని సూచిస్తుంది.

అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా సిమ్లా ఒప్పందాన్ని గౌరవించలేదు. ఎప్పుడు కూడా కాశ్మీర్ అంశంలో అంతర్జాతీయ జోక్యాన్ని కోరుకుంటూ వస్తుంది.

ఈ నేపథ్యంలో భారతదేశం 2019లో ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉగ్రవాదులు పహల్గామ్ లోళ దాడి జరిపిన నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పలు ఆంక్షలు విధించడంతో… సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.

సిమ్లా ఒప్పందంలోని ప్రధాన అంశాలు

రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయి.

తరువాతి కాలంలో కాశ్మీరు సమస్యలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పటికీ, ఈ అంశం ఆధారంగానే భారత్ అంగీకరించలేదు.

1971 డిసెంబరు నాటి సంధిరేఖను నియంత్రణ రేఖగా ఇరు దేశాలూ గుర్తించాయి. “ఏ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు”.

ఈ రేఖను ఆంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని రెండు దేశాల అధిపతుల ఆంతరంగిక సమావేశంలో అప్రకటిత ఒప్పందం కుదిరిందని భారత అధికారులు అన్నప్పటికీ పాకిస్తాన్ అధికారులు దాన్ని ఖండించారు.

ఈ రేఖను గుర్తించడంతో, భారత పాకిస్తాన్‌లలో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుల బృందానికి (UNMOGIP) పాత్ర ఏమీ లేదని భారత్ చెప్పింది.

1949 లో జరిగిన కరాచీ ఒప్పందం ద్వారా ఏర్పడిన సంధిరేఖను ఈ బృందం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడా రేఖయే లేదు కాబట్టి ఈ బృందం అవసరం లేదని భారత్ వాదన. అయితే, పాకిస్తాన్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బృందం ఇప్పటికీ రెండు దేశాల్లోనూ ఉంది.

ఈ ఒప్పందానికి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ 1972 జూలై 15 న ఆమోదముద్ర వెయ్యగా, భారత లోక్‌సభ 1972 ఆగస్టు 2 న, రాజ్యసభ ఆ మరుసటి రోజున ఆమోదించాయి.దాంతో ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4 నుండి అమల్లోకి వచ్చింది.

ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధం ఇందుకో ఉదాహరణ.

1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ సియాచెన్ గ్లేసియరును పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.

డిల్లీ ఒప్పందం :

ఢిల్లీ ఒప్పందం భారత, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రుల మధ్య ఢిల్లీలో 1973 ఆగస్టు 28 న కుదిరింది. దీని ప్రకారం మూడు దేశాలు యుద్ధ ఖైదీలను, పౌర ఖైదీలనూ ఇచ్చి పుచ్చుకుంటాయి.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు