BIKKI NEWS (AUG. 23) : Senior resident jobs in andhrapradesh 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 997 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్క సంవత్సరం కాలానికి ఈ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీ లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Senior resident jobs in andhrapradesh 2024
ఖాళీల వివరాలు :
సీనియర్ రెసిడెంట్ (క్లీనికల్) – 425
సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లీనికల్) – 479
సూపర్ స్పెషాలిటీ -93
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ/ డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, నియోనాటాలజీ.
అర్హతలు : మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 44 ఏళ్ల లోపల ఉండాలి.
వేతనం : 70,000/- రూపాయలు/నెలకు
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : 1,000/- (BC, EWS, SC, ST – 500/-)
దరఖాస్తు గడువు : 27/08/2024
దరఖాస్తు లింక్ : https://dmeaponline.com/
వెబ్సైట్ : https://dme.ap.nic.in/