Home > EDUCATION > 10th Class > 10th class – పదో తరగతిలో సెమిస్టర్‌ విధానం.!

10th class – పదో తరగతిలో సెమిస్టర్‌ విధానం.!

BIKKI NEWS (DEC. 06) : Semester system in 10th class. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్‌ విధానాన్ని తీసుకువచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

Semester system in 10th class.

ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. దీంతో ఒకేసారి సిలబస్‌ మొత్తం చదివి పరీక్షలు రాయాల్సి రావడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆరు నెలలకోసారి పరీక్షలు పెడితే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నది. సెమిస్టర్‌ విధానంపై ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు