స్కూల్ అసిస్టెంట్లకు డిప్యూటేషన్

హైదరాబాద్ (అక్టోబర్ 12) : తెలంగాణ రాష్ట్ర లో ఇటీవలే స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లలో అధిక సంఖ్యలో, పలు స్కూళ్లలో తక్కువ సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. Teachers transfers in telangana

దీంతో 10వ తరగతి పరీక్షలు, అకడమిక్ సిలబస్ పూర్తి కావడం వంటే పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా విద్యాధికారులకు స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక డిప్యూటేషన్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.

తాత్కాలిక పద్ధతిలో జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్లను డిప్యూటేషన్ చేయాలని ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాధికారులను ఆదేశించింది.