ROHIT SHARMA RECORDS

BIKKI NEWS : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పలు రికార్డులను (ROHIT SHARMA RECORDS) సృష్టించాడు ప్రపంచ కప్ పరంగా మరియు వన్డే రికార్డులను ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టాడు… వాటి వివరాలు చూద్దాం…

1) వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు కొట్టి (7), సచిన్ టెండూల్కర్ (6) పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

2) అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సులు (556) కొట్టిన బ్యాట్స్ మాన్ గా రికార్డు నెలకొల్పాడు ఇప్పటివరకు క్రిస్ గేల్ (553) పేరు మీద ఉన్న ఈ రికార్డును అధిగమించాడు.

3) వన్డే ప్రపంచ కప్ లో అత్యంత వేదంగా 1,000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్మెన్ గా డేవిడ్ వార్నర్ పేరు మీద ఉన్న రికార్డును (19 మ్యాచ్ లు) సమం చేశాడు.

4) వన్డే ప్రపంచ కప్ లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన (63 బంతుల్లో) సెంచరీ నమోదు చేసి కపిల్ దేవ్ పేరు మీద ఉన్న (72 బంతుల్లో)- రికార్డును బ్రేక్ చేశాడు.

5) అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు (31) కలిగిన 3 బ్యాట్స్మెన్ గా స్థానం సంపాదించాడు. సచిన్ టెండూల్కర్ 49, విరాట్ కోహ్లీ 47* సెంచరీలతో ముందు ఉన్నారు.

6) వన్డే ప్రపంచ కప్ లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు పొందిన రెండో (6 సార్లు) ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ (9 సార్లు) ముందున్నాడు.