DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th OCTOBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 11th OCTOBER 2023

1) వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సును నవంబర్ 3 నుండి 5 వరకు ప్రభుత్వం ఎక్కడ నిర్వహించనుంది.?
జ : న్యూడిల్లీ

2) మహారాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
జ : లెక్ లడ్కీ

3) అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 11

4) అంతర్జాతీయ బాలిక దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : invest in girls rights : our leadership our well-being

5) 8వ బ్రిక్స్ దేశాల కాంపిటీషన్ కాన్ఫరెన్స్ సదస్సు 2023 అక్టోబర్ 11 నుండి 13 వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : న్యూఢిల్లీ

6) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత వినియోగదారుల ద్రవ్యాల్బణం ఎంత శాతం గా ఉండనుంది.?
జ : 5.5%

7) నోకియా సంస్థ ఏ నగరంలో తన 6G ల్యాబ్ ఏర్పాటు చేసింది.?
జ : బెంగళూరు

8) బాలసాహిత్య పురష్కారం 2023 ఎవరు అందుకున్నారు.
జ : యన్.దిలీప్

9) 100 మీటర్ల పరుగునును 10.23 సెకండ్లలో పూర్తిచేసి జాతీయ రికార్డ్ నెలకొల్పినది ఎవరు.?
జ : మణికంఠ

10) ఏ గ్రహ శకలంపై నీరు, కార్బన్ ఉన్నట్లు నాసా ప్రకటించింది.?
జ : బెెన్ను

11) కేరళ రాష్ట్రం లిటరసి మిషన్ లో చదువు నేర్చుకున్న అత్యదిక వయస్కురాలిగా (101 సం.) రికార్డు సృష్టించిన ఏ మహిళల ఇటీవల మరణించారు.?
జ : కార్త్యాయని

12) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ప్రకారం భారత అప్పు ప్రస్తుతం జీడీపీలో ఎంత శాతంగా ఉంది.?
జ : 81.9%

13) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారత ద్రవ్య లోటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 8.8%

14) అంతర్జాతీయంగా గల భారత యువతను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : మేరా యువ భారత్ (మై భారత్)

15) పాలస్తీనా ప్రాంతంలో యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి భారతదేశం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ అజయ్

16) ) వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు కొట్టి (7), సచిన్ టెండూల్కర్ (6) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.

17) రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సులు (556) కొట్టిన బ్యాట్స్ మాన్ గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ (553) పేరు మీద ఉన్న ఈ రికార్డును అధిగమించాడు.

18) వన్డే ప్రపంచ కప్ లో అత్యంత వేదంగా 1,000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్మెన్ గా డేవిడ్ వార్నర్ పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ శర్మ (19 మ్యాచ్ లు) సమం చేశాడు.

19) వన్డే ప్రపంచ కప్ లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన (63 బంతుల్లో) సెంచరీ నమోదు చేసి కపిల్ దేవ్ పేరు మీద ఉన్న (72 బంతుల్లో)- రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.

20) అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ లలో అత్యధిక సెంచరీలు (31) కలిగిన 3 బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ స్థానం సంపాదించాడు. సచిన్ టెండూల్కర్ 49, విరాట్ కోహ్లీ 47* సెంచరీలతో ముందు ఉన్నారు.

21) వన్డే ప్రపంచ కప్ లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు పొందిన రెండో (6 సార్లు) ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ (9 సార్లు) ముందున్నాడు.