BLV CET – ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9 తరగతులలో అడ్మిషన్స్

BIKKI NEWS (MARCH 03) : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకులాల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను 6వ, 7వ, 8వ, 9వ‌ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) లో ఖాళీ సీట్లలో ప్రవేశాల (SC, ST GURUKULA BACKLOG SEATS ADMISSIONS FOR 2024 – 25 by BLV CET ) కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.

తెలంగాణకు చెందిన విద్యార్థినీ విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల అయింది. తెలంగాణ సాంఘీక సంక్షేమ (TSWREIS) మరియు గిరిజన సంక్షేమ (TTWREIS) గురుకులాల్లో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు.

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా 04-03-2024 నుండి 30-03-2024 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు :

a) 6వ, తరగతిలో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం॥లో 5వ తరగతి చదివి ఉండాలి.

b) 7వ తరగతిలో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం॥లో 6వ తరగతి చదివి ఉండాలి

C) 8వ తరగతిలో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం॥లో 7వ తరగతి చదివి ఉండాలి.

d) విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 మరియు 2023 -24 విద్యా సంవత్సరములలో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండవలెను.

విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/-కు మించరాదు.

ఎంపిక విధానం : ఎప్రిల్ – 21- 2024 నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేయబడతారు.

వయోపరిమితి : 6వ తరగతికి 12 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలడు.

7వ తరగతికి 13 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.

8వ తరగతికి 14 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.

దరఖాస్తు ఫీజు : రూ.100/-

పరీక్ష తేదీ : ఎప్రిల్ – 21 – 2024 ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల మద్య

వెబ్సైట్ : https://tgtwgurukulam.telangana.gov.in/

వెబ్సైట్ : www.tswreis.in