10th Exams – ఆరుగురి సిబ్బంది పై వేటు

BIKKI NEWS (MARCH 24) : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా నాలుగోరోజు జరిగిన మ్యాథమెటిక్స్ పరీక్షలో ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదో తరగతి పరీక్షల సిబ్బందిలో ఆరుగురిపై వేటు (telangana10th exams 4th day report) వేశామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఇద్దరు డిపార్ట్మెంటల్ అధికారులు, ఒక కస్టోడియన్ తో పాటు హైదరాబాద్ జిల్లాలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారిని విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

ఈ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 4,95,293 మంది దరఖాస్తు చేస్తే, 4,93,652 (99.67 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 1,641 (0.33 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరిం చారు. ప్రయివేటు విద్యార్థుల్లో 6,069 మంది దరఖాస్తు చేసుకుంటే, 5,301 (87.35 శాతం) పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 768 (12.65 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.