BIKKI NEWS (MARCH 20) : భారతీయ స్టేట్ బ్యాంక్ యూత్ ఫర్ ఇండియా (SBI Youth for India fellowship) పేరిట ఫెలోషిప్‌లకు దరఖాస్తు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పలు ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ.. వారికి ఆర్థిక చేయూతనందిస్తోంది.
గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫెలోషిప్ వ్యవధి : ఈ ఫెలోషిప్ వ్యవధి 13 నెలలు.
అర్హతలు : ఏదైనా డిగ్రీలో (2023 అక్టోబర్ నాటికి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 21 – 32 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : రిజిస్ట్రేషన్ అండ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైఫండ్ వివరాలు : ఎంపికైన వారికి వసతి కోసం నెలకు ₹ 15,000 స్టైపెండ్ చొప్పున ఇస్తారు. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు ₹ 1000/- ; ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు మరో ₹ 1000 చొప్పున చెల్లిస్తారు. అలాగే, ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో ₹ 70,000 అందజేస్తారు.
ఎంపికైన వారికి తమ ఇంటి నుంచి బయల్దేరడం మొదలు ప్రాజెక్టు చేసే ప్రదేశానికి చేరుకొనే వరకు ప్రయాణానికి 3ఏసీ రైలు ఛార్జీల ఖర్చులు, శిక్షణా కార్యక్రమాల కోసం ప్రయాణాలకు అవసరమైన ఖర్చుల్ని సైతం చెల్లిస్తారు.
వైద్య, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంటుంది.
గ్రామీణాభివృద్ధి కోసం ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జీఓలు ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి దిశానిర్దేశం చేస్తాయి. క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోడానికి ఎన్జీవో కేంద్రాలు సహకరిస్తాయి. అనంతరం ప్రోగ్రాం లక్ష్యానికి అనుగుణంగా వీరు కృషి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు గడువు : మే – 21 – 2024