SBI SCHOLARSHIP – 15 వేల నుంచి 7.5 లక్షల ఎస్బీఐ స్కాలర్‌షిప్

BIKKI NEWS (AUG. 18) : SBI ASHA SCHOLARSHIP 2024. ఎస్బీఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్ షిప్ 2024 కు నోటిఫికేషన్ జారీ చేసింది. 6వ తరగతి నుండి ఐఐఎం వరకు చదువుతున్న విద్యార్థులకు 15 వేల నుంచి 7.5 లక్షల వరకు స్కాలర్ షిప్ అందజేయనున్నారు. ఇది వన్ టైం స్కాలర్షిప్.

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ – 01 – 2024 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI ASHA SCHOLARSHIP 2024

అర్హతలు : 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మరియు డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎం లలో చదువుతున్న పేద విద్యార్థులు అర్హులు.

గత విద్యా సంవత్సరం లో కచ్చితంగా 75% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

కుటుంబ ఆదాయం 3 లక్షల రూపాయల లోపల ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు

దరఖాస్తు గడువు : అక్టోబర్ – 01 – 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

స్కాలర్ షిప్ విలువ

6వ తరగతి నుంచి ఇంటర్ వరకు – 15 వేల రూపాయలు అందిస్తారు

డిగ్రీ విద్యార్థులకు – 50 వేల రూపాయలు అందిస్తారు

పీజీ విద్యార్థులకు – 70 వేల రూపాయలు అందిస్తారు

ఐఐటీ విద్యార్థులకు – 2 లక్షల రూపాయలు అందిస్తారు

ఐఐఎం విద్యార్థులకు -7.50 లక్షల రూపాయలు అందిస్తారు

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ మరియు విద్యార్థుల ఆర్థిక పరిస్థితి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు స్కాలర్ షిప్ కు ఎంపిక చేస్తారు.

అనంతరం ఎంపికైన అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా స్కాలర్షిప్ నగదును జమ చేస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్ లు

  • గత విద్యా సంవత్సరం మార్క్స్ షీట్
  • ప్రస్తుత విద్యా సంవత్సరం అడ్మిషన్ వివరాలతో కూడిన సర్టిఫికెట్
  • ప్రభుత్వ గుర్తింపు కార్డు
  • ఆదాయ ధ్రువీకరణ పత్రము (ఇన్కమ్ సర్టిఫికెట్)
వెబ్సైట్ : https://www.sbifashascholarship.org/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు