SBI JOBS – 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 13) : SBI 1511 SPECIALIST CADRE OFFICER JOB NOTIFICATION 2024. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 1511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ లోపల ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI 1511 SPECIALIST CADRE OFFICER JOB NOTIFICATION 2024

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి

పోస్టింగ్ స్థలం : నవీ ముంబయి/ హైదరాబాద్ లలో పోస్టింగ్ ఇవ్వబడును.

ఖాళీల వివరాలు :

  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్ వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 14 – 2024 నుంచి అక్టోబర్ 14 – 2024 వరకు.

దరఖాస్తు ఫీజు : 750/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయో పరిమితి: 30.06.2024 నాటికి

  • డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు,
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి .

పే స్కేల్ :

  • నెలకు డిప్యూటీ మేనేజర్లకు రూ.64,820- రూ.93,960.
  • అసిస్టెంట్ మేనేజర్లకు రూ.48,480- 5.85,920.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

వెబ్సైట్ : https://sbi.co.in/web/careers/current-openings

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు