Home > EDUCATION > SCHOLARSHIP > SANTOOR SCHOLARSHIP 2024 : 24 వేల సంతూర్ స్కాలర్‌షిప్

SANTOOR SCHOLARSHIP 2024 : 24 వేల సంతూర్ స్కాలర్‌షిప్

BIKKI NEWS (AUG. 23) : SANTOOR SCHOLARSHIP 2024. విప్రో కేర్ సంస్థ చదువలో గ్రామీణ ప్రాంత విద్యార్థినిలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం సంతూర్ స్కాలర్షిప్ 2024 సంబంధించి ప్రకటన విడుదల చేసింది. నెలకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 24 వేల రూపాయలను బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసే వరకు అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్ కు కేవలం బాలికలు మాత్రమే అర్హులు.

SANTOOR SCHOLARSHIP 2024

ఆర్థికంగా వెనకబడి ఉన్న బాలికలను ఆదుకోవడం కోసం ఈ స్కాలర్షిప్ అందజేయబడుతుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థినిలు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విప్రో కన్జ్యూమర్ కేర్ మరియు విప్రో కేర్ సంస్థలు సంయుక్తంగా ఈ స్కాలర్షిప్ ను అందజేస్తున్నాయి. దాదాపు 1900 మంది బాలికలకు ఈ స్కాలర్‌షిప్ ను అందజేయనున్నారు.

అర్హతలు :

  • పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో పూర్తి చేసి ఉండాలి.
  • బ్యాచిలర్ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ పొంది ఉండాలి. ఈ డిగ్రీ కాలపరిమితి కనీసం మూడు సంవత్సరాలుగా ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థినిలు మాత్రమే ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

స్కాలర్‌షిప్ విలువ : ఎంపికైన విద్యార్థినిలకు నెలకు 2,000/- రూపాయల చొప్పున సంవత్సరానికి 24 వేల రూపాయలను కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ ను అందజేస్తారు.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో

దరఖాస్తు ఫారం ను కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకులో డౌన్లోడ్ చేసుకుని, దానిలో వివరాలను పూర్తి చేసి కింద ఇవ్వబడిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 20 వ తేదీ లోపల పంపవలసి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 30- 2024

దరఖాస్తు పంపవలసిన చిరునామా : విప్రో కేర్స్, సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్, బెంగళూరు, కర్ణాటక.

వెబ్సైట్ : http://www.santoorscholarships.com/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు