Home > UNCATEGORY > జీజేసి సంగెంలో సంక్రాంతి రంగవల్లుల పోటీలు

జీజేసి సంగెంలో సంక్రాంతి రంగవల్లుల పోటీలు

BIKKI NEWS (JAN. 10) : sankranthi rangavalli competition in GJC Sangem. సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ప్రిన్సిపాల్ కాక మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీలు విద్యార్థులలో ఎంతగానో ఆసక్తిని రేకెత్తించాయి.
విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రంగవల్లులను రూపొందించారని ముఖ్య అతిధిగా మరియు రంగవల్లుల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా హాజరైన సంగెం మాజీ MPP శ్రీమతి శ్రీ కాందకట్ల కళావతి తెలిపారు.

sankranthi rangavalli competition in GJC Sangem.

విజేతలకు ప్రధమ, ధ్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతులను ప్రకటించారు.. సాంప్రదాయ కళలు, సాంస్కృతిక విలువలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఇలా అనేక అంశాలను ఆధారంగా చేసుకుని రంగవల్లులను విద్యార్థులు రూపొందించారు.

ఈ పోటీల్లో విద్యార్థులు తమ మిత్రులతో కలిసి పనిచేస్తూ జట్టుగా పోటీ పడ్డారు. ఇది వారిలో సహకార స్ఫూర్తిని పెంపొందిస్తుంది అని కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు పేర్కొన్నారు.

ఈ పోటీల ద్వారా విద్యార్థులలో కళాత్మక నైపుణ్యాలు పెరుగుతాయని, సామాజిక స్పృహ పెరుగుతుందని కళాశాల సీనియర్ అధ్యాపకురాలు శ్రీమతి శ్రీ బండి విజయ నిర్మల తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంధపాలకులు రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సుధీర్ కుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాకసాయిలు, రాఖీ, కుమారస్వామి చిరంజీవి, మాధవి, అక్రమ్ అలీ, పద్మ, రమాదేవి, సదయ్య, శివ,లక్ష్మి, సంగీత, విద్యార్తిని విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు