BIKKI NEWS (JUNE 22) : Rythu Bharosa for ORR inside lands. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగు భూములకు కూడా రైతు భరోసా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సాగు భూములకు రైతు భరోసా ఇవ్వలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Rythu Bharosa for ORR inside lands
ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2.18 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని… సుమారు 98 లక్షల ఎకరాలే రియల్ వెంచర్లు ఇతర వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు తేలిందని మంత్రి తెలిపారు.
అయితే ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగులో ఉన్న 1.20 లక్షల ఎకరాలకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు
ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పాసుపుస్తకాల ఆధారంగా అర్హులను ఎంపిక కూడా చేసినట్లు తెలిపారు. జూన్ 24 నుండి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సాగు చేస్తున్న భూముల రైతులకు రైతు భరోసా నగదు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్