RYTHU BHAROSA – ఉప సంఘం నివేదిక ఆధారంగా రైతుభరోసా

BIKKI NEWS (JULY 25) : Rythu Bharosa after Cabinet sub committee report. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపి.. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా మంత్రి మండలిలో చర్చించి విధివిధానాలు సిద్ధం చేస్తామని, అనంతరం రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో లో తెలిపారు.

Rythu Bharosa after Cabinet sub committee report

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రూ.7,565 కోట్లతో రైతు భరోసా అమలు చేశామన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

రైతు భరోసా ఆలస్యం చేయడం సరికాదని, వెంటనే పాత పద్ధతిలోనైనా చెల్లింపులు చేయాలని ఏవీఎన్‌ రెడ్డి, సుభాష్‌ రెడ్డి, రఘోత్తం రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

‘‘ఏకకాలంలో రూ.31 వేల కోట్లతో రైతు రుణమాఫీ ఆగస్టులోగా పూర్తి చేస్తాం. అనంతరం రైతు భరోసాపై విధివిధానాలు ప్రకటిస్తాం. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తాం. పంట వేయని, లేఅవుట్లు వేసిన భూములకు రూ.25 వేల కోట్ల చెల్లింపులు జరిగాయన్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఉంది. దీన్ని ఏవిధంగా నివారించాలన్న విషయమై చర్చిస్తున్నాం. రైతుల అభిప్రాయాలు తీసుకుని విధివిధానాలు ఖరారు చేస్తాం’’ అని మంత్రి తెలిపారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు