BIKKI NEWS (FEB. 25) : రైతుబంధు (రైతు భరోసా) సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండిం చకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు పై త్వరలోనే నూతన విధివిధానాలు రూపొందించనున్నట్లు తెలిపారు.
నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు కమిటీ సభ్యులైన ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, షుగర్ కేన్ డైరెక్టర్ మల్సూర్ శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని శక్కరనగర్ లో గల నిజాం షుగర్స్ ను సందర్శించారు. చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.