Home > 6 GUARANTEE SCHEMES > Rythu Bandhu – రైతు బంధు డబ్బులు రికవరీ

Rythu Bandhu – రైతు బంధు డబ్బులు రికవరీ

BIKKI NEWS (JULY 12) : Rythu bandhu amount recovery from lay out owners. వ్యవసాయేతర భూమికి రైతు బంధు తీసుకున్న వ్యక్తుల నుండి డబ్బులు వాపస్ రప్పించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో వ్యవసాయతర భూములకు రైతుబంధు పొందిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.

Rythu bandhu amount recovery from lay out owners

తాజాగా మేడ్చల్ జిల్లాలో వెంచర్ వేసిన భూమికి దాదాపు 16 లక్షల రైతుబంధు కింద తీసుకున్నట్లు గుర్తించిన అధికారులు. ఈ నేపథ్యంలో సంబంధిత వెంచర్ యజమానులకు డబ్బు వాపస్ కోసం నోటీసులో జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇదే విధంగా రాష్ట్రం మొత్తం వ్యవసాయేతర భూములకు రైతుబంధు తీసుకున్న వ్యక్తుల డేటాను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్నట్లు సమాచారం. ఈ విధంగా దాదాపు గత ప్రభుత్వ హయాంలో 25వేల కోట్ల రూపాయలు వ్యవసాయోతర భూములకే రైతుబంధు రూపంలో చెల్లించినట్లు ప్రాథమికంగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది.

వెంచర్ వేసిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా వచ్చాయని విచారణ ప్రారంభంబించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఇదే వ్యాప్ ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్లు వేసిన భూములకు ఎక్కడెక్కడ పాస్ పుస్తకాలు జారీ చేశారు, మరియు రైతుబంధు నిధులను జమ చేశారు అనే లెక్కలను ప్రభుత్వం ఆరా తీస్తుంది.

త్వరలోనే రైతు భరోసా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమయింది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలలో రైతుల అభిప్రాయాలను సేకరిస్తుంది. వ్యవసాయోతర భూములకు రైతు భరోసా నిధులు నిలిపివేసేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే గరిష్టంగా 10 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా చెల్లింపు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు