Home > EDUCATION > INTERMEDIATE > ఇంటర్ అడ్మిషన్లపై డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య సమీక్ష సమావేశం

ఇంటర్ అడ్మిషన్లపై డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య సమీక్ష సమావేశం

BIKKI NEWS (JUNE 10) : Review meeting on intermediate admissions 2025. ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఐ.ఏ.ఎస్., గారి అధ్యక్షతన 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది.

Review meeting on intermediate admissions 2025

ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో డైరెక్టర్ గారు జూమ్ సమావేశం లో చర్చించారు. ఇప్పటివరకు సుమారు 35,000 అడ్మిషన్లు నమోదైనట్లు తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం ఒక లక్ష (1,00,000) కి పైగా విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి అధ్యాపకుడు ప్రణాళికాబద్ధంగా స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను కలుస్తూ సమన్వయంతో అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. కళాశాలల్లో ఉన్న సదుపాయాలు, అవసరాలను గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను విద్యాశాఖకు తక్షణమే సమర్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విశిష్టతలను విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియపరుస్తూ అడ్మిషన్ల పెంపుదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డైరెక్టర్ గారు సూచించారు, అవి అడ్మిషన్లలో కీలకంగా సహాయపడతాయన్నారు. ముఖ్యాంగా విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, రిమీడియల్ తరగతులు, కెరీర్ మార్గదర్శకత్వం, వృత్తివిద్యా కోర్సులు, ఒత్తిడిలేని, సానుకూల విద్యా వాతావరణంలో విద్యా ప్రణాళికలు, అర్హత కలిగిన, అంకితభావంతో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆట మైదానాలు, కంప్యూటర్ ల్యాబ్స్, సమగ్ర అభివృద్ధికి కేంద్రంగా వివిధ సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు. ఇలాంటి ప్రత్యేకతలను హైలైట్ చేస్తూ అడ్మిషన్ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తమ బాధ్యతను నిర్వర్తించాలని డైరెక్టర్ గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలల విశ్వసనీయతను పెంచుతూ విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు