BIKKI NEWS (JUNE 17) : Requesting for History Tourism PG course. వరంగల్లు జిల్లా కేంద్రంలోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం _ జానపద గిరిజన విజ్ఞానం పీఠం పిఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న గారిని చరిత్ర పరిరక్షణ సమితి నాయకులు మంగళవారం రోజున ఆయన ఛాంబర్ లో కలిసి వరంగల్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఈ విద్యా సంవత్సరం నుండి నూతనంగా చరిత్ర, టూరిజం కోర్సును ప్రవేశపెట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.
Requesting for History and Tourism PG course
ఈ సందర్బంగా పిఠాధిపతి మాట్లాడుతూ… చరిత్ర టూరిజం కోర్సు గురించి రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లి ఈ విద్యా సంవత్సరం నుండి చరిత్ర, టూరిజం కోర్సు పెట్టుటకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చరిత్ర పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చరిత్ర పరిరక్షణ సమితి, కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ డాక్టర్ బి. రమేష్ నాయక్,
మాలోత్ వెంకన్న నాయక్, చరిత్ర పరిరక్షణ సమితి నాయకులు భుక్య రమేష్ నాయక్, బానోతు సాయి కృష్ణ,
అసిస్టెంట్ ప్రొఫసర్స్ డా.రవికుమార్, డా. బి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్