Home > EDUCATION > INTERMEDIATE > INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం

INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం

BIKKI NEWS (JULY 03) : Report on Intermediate merge in school education. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పదవ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత శాతం కనిపిస్తోందని, ఇంటర్ లో ఆ శాతం గణనీయంగా తగ్గిపోతుందని…ఈ సమస్యకు పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలని విద్యాశాఖ పై జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

Report on Intermediate merge in school education

ఇతర రాష్ట్రాల్లో తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉందని, ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు.

తాజాగా కేంద్ర విద్యా శాఖ కూడా ఇంటర్ లో ఉత్తీర్ణత శాతం పెరగడానికి ప్లస్ 2 పద్ధతిని అవలంబించాలని రాష్ట్రాలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

ఇంటర్మీడియట్ విద్య మెరుగుకు చర్యలు చేపట్టేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు