BIKKI NEWS (AUG. 15) : RELIANCE SCHOLARSHIP 2024. దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి తమ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది. 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ మొత్తం 5100 మందికి స్కాలర్షిప్లు అందించనుంది.
RELIANCE SCHOLARSHIP 2024
దేశ వృద్ధిలో కీలకమైన యువతను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్ 2022లో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. దీని ద్వారా పదేళ్లలో 50,000 మందికి స్కాలర్షిప్లు అందించడం లక్ష్యం.
ఈ విద్యా సంవత్సరంలో అందించే స్కాలర్షిప్లలో 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తోంది.
ఈ స్కాలర్షిప్ కింద అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.2 లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షల వరకు సాయం అందించనుంది. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు అక్టోబర్ 6వ తేదీ..
వెబ్సైట్ : https://reliancefoundation.org/reliance-foundation-scholarships-2024-25