RELIANCE SCHOLARSHIP : డిగ్రీలో 2 లక్షలు‌, పీజీలో 6 లక్షల స్కాలర్‌షిప్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : డిగ్రీ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విధానంలో చదువుతున్న విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ అందించి రిలయన్స్ మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్ ద్వారా (reliance foundation scholarship 2023 notification) డిగ్రీ మూడు సంవత్సరాల లో 2 లక్షల వరకు స్కాలర్షిప్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : ఇంటర్మీడియట్ లో 60% పైబడిన మార్కులు కలిగి ఉండి కుటుంబ ఆదాయం 15 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ప్రతి సంవత్సరం రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 5,000 మంది విద్యార్థులకు డిగ్రీ చదువుకునే సమయంలో రెండు లక్షల స్కాలర్షిప్ ను అందించాలని రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యం పెట్టుకుంది.

★ PG SCHOLARSHIP – 6 లక్షలు

పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ (reliance foundation pg scholarship 2023 application) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . 100 మంది ఎంపిక అయినా విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యో లోపు 6 – లక్షల స్కాలర్షిప్ అందిస్తుంది. డిగ్రీ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : అక్టోబర్ 15 – 2023

ఎంపిక విధానము : ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా…

పరీక్ష విధానము : వెర్బల్, ఆనలైటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ విభాగాలలో విభాగానికి 20 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి పరీక్షను ఆన్లైన్ ద్వారా రాయాల్సి ఉంటుంది.

ఫలితాలు : ఎంపికైన అభ్యర్థుల వివరాలు డిసెంబర్ 2023లో ప్రకటిస్తారు

వెబ్సైట్ : APPLY HERE