కొలువులిచ్చే కొత్త సర్టిఫికెట్ కోర్సులకు శ్రీకారం

హైదరాబాద్ (సెప్టెంబర్ 27) : విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు కొత్తగా మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు (job oriented new skills courses in telangana) తెలంగాణ విద్యా మండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను మన రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కొలువులిచ్చే లక్ష్యంతో 6 నెలల నుంచి ఏడాది వ్యవధి ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు విద్యామండలి అధికారులు నిపుణులతో చర్చించారు. ఈ విషయమై విద్యామండలి కార్యదర్శి, ప్రిన్సిపాళ్లు, ఇతర నిపుణుల నుంచి సూచనలు తీసుకొన్నారు.

హోటల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, యోగా, కెమికల్ సేఫ్టీ, కన్స్ట్రక్షన్ సేఫ్టీ, ఆఫీసు ఆటోమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, పంచకర్మ వంటి కోర్సుల సిలబస్ రూపొందించడం, వాటి పేర్లను మార్చి ప్రవేశపెట్టడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.