2K NOTES : 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ

ముంబై (మే – 19) : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2 వేల రూపాయలు నోట్లను వ్యవస్థ నుండి ఉపసంహరించుకుంది (rbi withdraws 2 thousand notes). 2వేల నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.

ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని RBI తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అలాగే బ్యాంకులు కూడా ఖాతాదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని RBI స్పష్టం చేసింది.