DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 19th MAY 2023

1) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి

2) క్రెడిట్ కార్డులు విదేశాల్లో ఎంతకు మించి వాడితే 20% టిసిఎస్ విధించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.?
జ : 7 లక్షలు

3) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఎంత డివిడెంట్ చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : 87,416 కోట్లు

4) ప్రపంచ కప్ అర్చరీ స్టేజ్ – 2 టోర్నీలో మిక్స్డ్ విభాగంలో ఫైనల్ లోకి చేరిన భారత జోడి ఏది.?
జ : జ్యోతి సురేఖ, ప్రవీణ్

5) క్వీన్ ఎలిజిబెత్ – 2 అంత్యక్రియలకు ఎంత ఖర్చయినట్లు బ్రిటన్ కోశాగార విభాగం వెల్లడించింది.?
జ : 1,665 కోట్లు

6) జి 7 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో ప్రారంభమైంది.?
జ : జపాన్

7) రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబు దాడికి గురైన హీరోషిమా శాంతి పార్కులో అమరులకు నివాళిగా జీ7 శిఖరాగ్ర దేశాల నేతలు ఏ మొక్కను నాటారు.?
జ : చెర్రీ మొక్క

8) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటూ నిర్ణయం ప్రకటించింది.?
జ : 2,000 రూపాయల నోటు

9) సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2023లో దేశంలో నుండి ఎన్ని యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి.?
జ : 64 (IIT అహ్మదాబాద్ దేశంలో మొదటి స్థానం)

10) సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో తెలంగాణ నుండి చోటు సంపాదించుకున్న యూనివర్సిటీలు ఏవి.?
జ : హెచ్‌సీయు, ఐఐటి హైదరాబాద్

11) ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగినుల భద్రత కోసం ‘సాహస్’ పేరుతో పోర్టల్ ను ప్రారంభించింది.?
జ : తెలంగాణ

12) ముంబై నగరంలోని ముంబై కోస్టల్ రోడ్డుకు ఎవరి పేరును పెట్టారు.?
జ : చత్రపతి శివాజీ రోడ్

13) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పరమేందర్ చోప్రా

14) రీడింగ్ లాంజ్ కలిగి ఉన్న మొట్టమొదటి భారత దేశ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది.?
జ : లాల్ బహుదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం (వారణాసి)

15) బెర్లిన్ ఒలంపిక్స్ కు గాను భారత తరఫున అంబాసిడర్ గా ఏ నటుడు నియమితుడయ్యాడు.?
జ : ఆయుష్మాన్ ఖురానా