RBI MONITORY POLICY : నిర్ణయాలు

ముంబై (ఆగస్టు – 11) : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో(RBI MONITORY POLICY 2023) వడ్డీరేట్లను యధాతధంగా ఉంచడంతో పలు కీలక విషయాలను పై నిర్ణయం తీసుకుంది.

వడ్డీ రేట్లు, క్యాష్ రిజర్వులు, ద్రవ్యోల్బణం, యూపీఐ పేమెంట్లు, వడ్డీ విధానాలు, ఆర్థికాభివృద్ధి అంచనాలను ఈ సందర్భంగా ఆర్బిఐ ప్రకటించింది.

◆ రెపోరేట్ & 6.5%

గతేడాది నుండి 2.5% వరకు రేపోరేట పెంచిన ఆర్బీఐ గత మూడు పాలసీ నిధానాలలో పెంచకుండా ఉంది. దీంతో వడ్డీ రేట్లు యదాతదంగా ఉండనున్నాయి. రెపో రేట్ ను 6.5% వద్ద ఉంచింది.

◆ CRR @ 14.5%

రేపు రేటును యధాతధంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ రిజర్వ్ రేషియో ను ఒకేసారి 10 పాయింట్లు పెంచడంతో 14.5 శాతానికి చేరింది. ఇది బ్యాంకులకు పెద్ద ఎదురుదెబ్బ. బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్ లలో ఇంతకుముందు 4.5% మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వుగా ఉంచాల్సి ఉండేది. ఇప్పుడు 14.5% రిజర్వులను కేంద్ర బ్యాంకు వద్ద ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకుల నుండి రిజర్వు బ్యాంకుకు ఒకేసారి లక్ష కోట్లు అందనున్నట్లు అంచనా.

◆ ద్రవయోల్బణం అంచనాలు పెంపు

ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం అంచనాలను 5.1 శాతం నుండి 5.4 శాతానికి పెంచుతూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుత త్రైమాసికం జులై – సెప్టెంబర్ మధ్య ద్రవ్యోల్బణం అంచనాలను 5.2 శాతం నుండి భారీగా 6.2 శాతానికి పెంచింది. దీంతో ధరల స్థిరీకరణపై తగు చర్యలు తీసుకుంటామని శక్తికాంత దాస్ వెల్లడించారు.

◆ ఆర్దికాబివృద్ది & 6.5%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023 – 24 లో భారత ఆర్థిక అభివృద్ధిని 6.5 శాతంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తి కాంతదాస్ ప్రకటించారు.

◆ UPI LITE LIMIT @ 500

పిన్ నెంబర్ తో పని లేకుండా లావాదేవీలు జరిపే యూపీఐ లైట్ లావాదేవీల గరిష్ట పరిమితిని 200 నుండి 500 రూపాయలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షలో నిర్ణయం తీసుకుంది.

◆ వడ్డీ విధానం మార్పుకు చర్యలు

గృహ రుణాలు తీసుకున్న వినియోగదారులకు బ్యాంకులు రెండు రకాల వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఒకటి ఫిక్స్డ్ వడ్డీ రేటు కాగా రెండోది ఫ్లోటింగ్ వడ్డీ రేటు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణం తీసుకున్నప్పటికీ వడ్డీ రేటుని రుణం తీరిపోయే వరకు ఆర్బిఐ వడ్డీరేట్ల తో సంబంధం లేకుండా మార్పు చెందకుండా అమలు చేస్తారు.

ఫ్లోటింగ్ వడ్డీ రేట్లలో ఆర్బిఐ ద్రవ్య విధాన సమీక్షల నిర్ణయాల మేరకు వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులను అమలు చేస్తారు. దీంతో ఋణ కాలపరిమితి, ఈఎంఐ విలువలో మార్పు చెందుతూ ఉంటాయి.

అయితే రుణ గ్రహీతలు ఇప్పుడు ప్లోటింగ్ రేట్ నుండి ఫిక్స్డ్ వడ్డీ రేటుకు, ఫిక్స్డ్ వడ్డీ రేటు నుండి ఫ్లోటింగ్ వడ్డీ రేటుకు మార్పు చేసుకునే అవకాశాన్ని ఆర్బిఐ కల్పించనుంది. దీని మీద త్వరలో నిర్ణయం తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంతాదాస్ ప్రకటించారు.