BIKKI NEWS (AUG. 27) : Ration cards and health cards in parama palana programme. సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు.
Ration cards and health cards in parama palana programme
ఈ కార్డుల జారీకి ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి అనుసరించాల్సిన పద్ధతి, హెల్త్ ప్రొఫైల్స్ నమోదుకు చేయాల్సిన వైద్య పరీక్షలు, అందుకోసం వైద్య శిబిరాల నిర్వహణ, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాబోరేటరీల వివరాల వంటి అంశాలన్నింటినీ పరిశీలించి కార్యాచరణ సంసిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలతో పాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.