Home > TELANGANA > Rajiv Yuva Vikasam – స్థానిక ఎన్నికల తర్వాత రాజీవ్ యువవికాసం.!

Rajiv Yuva Vikasam – స్థానిక ఎన్నికల తర్వాత రాజీవ్ యువవికాసం.!

BIKKI NEWS (JUNE 25) : Rajiv Yuva Vikasam after Local body elections. రాజీవ్ యువ వికాస పథకం అమలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చేపట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసినియ సమాచారం.

Rajiv Yuva Vikasam after Local body elections

రాజీవ్ వికాసం పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ ఇబీసి వర్గాలకు చెందిన 16,27,584 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం 4,99,234 యూనిట్లను ఇప్పటికే మంజూరు చేసింది.

తొలి దశలో 50వేల లోపు యూనిట్లతో మొదలుపెట్టి చివరగా నాలుగు లక్షల యూనిట్లకు నిధులు అందివ్వాలని భావించింది.

వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బ్యాంకులు సిబిల్ స్కోర్ కి ప్రాధాన్యం ఇవ్వటం ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.

ఈరోజు హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు నగదు బదిలీ చేసే కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాజీవ్ యువ వికాసం పథకం కోసం 6,000 కోట్ల నగదు అవసరం కానుంది. ఈ మేరకు నగదు సమీకరణకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.