BIKKI NEWS (JULY 01) :RAIL ONE ALL IN ONE RAILWAY APP. రైల్వే ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకేచోట అందించే ‘రైల్ వన్’ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లందరికీ యాప్ అందుబాటులో ఉంది.
RAIL ONE ALL IN ONE RAILWAY APP.
- టికెట్ల బుకింగ్ (రిజర్వుడు, అన్ రిజర్వుడు)
- ప్లాట్ ఫాం టికెట్లు
- రైళ్ల సమయాల వివరాలు
- పీఎన్ఆర్ విచారణ
- ప్రయాణ ప్లానింగ్
- రైల్వే హెల్ప్ లైన్ సేవలు
- ఆహారం బుకింగ్
- సరుకు రవాణా వివరాలు
- ట్యాక్సీ బుకింగ్
ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడంతోపాటు అత్యంత సులభంగా.. సరళంగా ఉండేలా ‘రైల్వే వన్’ యాప్ ఇంటర్ ఫేస్ ను రూపొందించామని రైల్వేశాఖ వెల్లడించింది.
యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాక.. గతంలో ఉన్న రైల్ కనెక్ట్, యూటీఎస్ ఆన్లైన్ మొబైల్ యాప్ నకు ఉన్న లాగిన్ వివరాలతో రైల్వే వన్ లో లాగిన్ కావొచ్చు.
సులభంగా లాగిన్ అయ్యేలా ఎం-పిన్తో పాటు బయోమెట్రిక్ సౌకర్యమూ ఇందులో ఉంది.
కొత్త వినియోగదారులు.. సులభంగా రిజిస్టరయ్యేలా అతి తక్కువ సమాచారం అందిస్తే సరిపోతుంది.
రిజిస్టరుకాని వినియోగదారులు.. గెస్ట్ లాగిన్ ఆప్షన్ తో మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా వివరాలను పొందవచ్చు.
రైల్వే వన్ యాప్ళలో ఆర్-వాలెట్ (రైల్వే ఈ-వాలెట్) సౌకర్యం ఉంది. ముందుగానే అందులో డబ్బును జమ చేసుకుని సేవలకు చెల్లించవచ్చు.
ఈ యాప్ ద్వారా ప్లాట్ ఫాం టికెట్లపై 3% డిస్కౌంట్ తో పొందొచ్చు.
- INTER – ప్రభుత్వ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, టీవీలు – సీఎం గ్రీన్ సిగ్నల్
- JL JOBS – జూనియర్ కళాశాలల్లో త్వరలో 273 పోస్టుల భర్తీ
- DAILY GK BITS IN TELUGU 3rd July
- చరిత్రలో ఈరోజు జూలై 03
- REVIEW : విద్యాశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు జారీ