Home > EMPLOYEES NEWS > JL PROMOTIONS – ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు ఈ వారమే

JL PROMOTIONS – ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు ఈ వారమే

BIKKI NEWS (JULY 09) : Principal Promotions in government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులకు ఈవారంలోనే ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందనున్నారు.

Principal Promotions in government junior colleges.

ప్రస్తుతం సీనియర్ అధ్యాపకులే కళాశాలల్లో ఇన్ఛార్జి ప్రిన్సిపాళ్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా పదోన్నతుల ద్వారా ఈ పోస్టులను జేఎల్స్ తో భర్తీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 430 ఇంటర్ కళాశాలలుండగా.. అందులో కొత్తవి 18. అయితే ప్రస్తుతం పాత కళాశాలల్లో 85 ప్రిన్సిపాళ్ల పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు.

సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జాబితా సిద్ధంచేశారు. ఈ వారంలోనే 1.3 నిష్పత్తిలో అధ్యాపకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కి ప్రకారం ప్రిన్సిపాళ్లను రాష్ట్ర కేడర్, అధ్యాపకులను మల్టీజోన్ పోస్టులుగా మారుస్తూ. 1993లోని సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 27 జారీ చేసింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు