వ్యాసకర్త – అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
BIKKI NEWS (SEP. 16) : Praja palana day on September 17th. సెప్టెంబర్ 17 ..ఈ తేదీ తెలంగాణ ఆధునిక చరిత్రలో ఒక భావోద్వేగ రోజు. అసంఖ్యాక ఉద్యమాలు, అశేష త్యాగాలు స్మరించుకునే సందర్భం.1920లో తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణకు,సంస్కరణలకు బీజం వేసిన ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహా సభగా మారి అ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో 1946-1951 వరకు సాయుధ పోరాటాన్ని నిర్వహించింది.
Praja palana day on September 17th
తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తలపెట్టింది. – అస్నాల శ్రీనివాస్
దశాబ్దాలుగా సామాజిక ఆర్థిక సాంస్కృతిక జీవనంలో జడత్వాన్ని తొలగించి పెను మార్పులను తీసుకవచ్చింది. ఈ సందర్భ నేపథ్యాన్ని స్మరించుకుంటూ ఆ పోరు అందించిన ప్రధాన తాత్వికత వివక్షత అంతరాలు లేని ప్రతి మనిషికి ఒకే విలువ ప్రాతిపదికతతో పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడం, ఈ ఇతివృత్తముతో తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తలపెట్టింది.
సెప్టెంబర్ 17 ..ఈ తేదీ తెలంగాణ ఆధునిక చరిత్రలో ఒక భావోద్వేగ రోజు. అసంఖ్యాక ఉద్యమాలు, అశేష త్యాగాలు స్మరించుకునే సందర్భం. – అస్నాల శ్రీనివాస్
నిజాం రాచరిక నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, నిజాం సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడానికి హైద్రాబాద్ రాజ్య ప్రజలు ప్రాతినిధ్యాలు, సత్యాగ్రహాలు, అంతిమంగా సాయుధపోరాటంతో తమ విముక్తిని సాధించుకున్న రోజుగా సెప్టెంబర్ 17 నిలిచిపోతుంది. సంస్థానంలో భాగమైన తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా రాచరిక ఫ్యూడల్ దోపిడీని,పరోక్షంగా విదేశీ వలస దోపిడీకి గురైన స్థితి సుదీర్ఘంగా కొనసాగింది.చరిత్రలో మున్నెన్నడు లేని విధంగా తెలంగాణ ప్రజలు దుర్భర బానిసత్వానికి లోనయ్యారు. రాచరికానికి వెన్నుదన్నుగా .గ్రామాలలో ఉన్న భూస్వాములు, దేశముఖ్ లు, పటేల్ పట్వారీలు అధిపత్యంలో ప్రజలు నిర్బంధ శ్రమ వెట్టి చాకిరీ చేసారు. విద్యా హక్కు 99% ప్రజలకు లభించలేదు. సాగు భూమిలో 90% రాజు, భూస్వాముల చేతిలో కేంద్రీకృతం అయ్యింది. సామాజిక వివక్షత తీవ్రత తో ప్రజలు బానిస జీవనం గడుపుతున్న కాలమది. దీనితో పాటు తమ ఉనికికి, జీవానికి, సంస్కృతికి, ఆత్మ గౌరవానికి ,ప్రత్యేకతకు పలు సృజనాత్మక కళలకు, కార్యకాలాపాలకు భూమికగా ఉన్న మాతృభాష తెలుగుకు ఆదరణ మృగ్యం అయ్యింది. ఈ క్రమంలో తొలి తరం విద్యావంతులైన సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హన్మంతరావు, మునగాల సంస్థానం పెద్దలు నాయని వెంకట రంగారావు మొదలగు వైతాళికులు నేతృత్వంలో భాషా సంస్కృతుల పరిరక్షణకు ఆంధ్ర మహాసభ ద్వారా కృషి చేసారు.
బెనారస్ విశ్వ విద్యాలయ విద్యార్థిగా. కాంగ్రెస్ సారధ్యంలో కొనసాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొన్న రావి నారాయణ రెడ్డి సారధ్య 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ రాచరిక రద్దు, భారత్ లో విలీన పోరును గొప్ప ముందడుగును వేయించింది. సాంఘిక ఆర్థిక అంశాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే పిలుపుకు అత్యంత ధైర్య సాహసాలతో కడవెండి గ్రామం ఉద్యమ భూకంప కేంద్రంగా మారింది. నిజాం రజాకార్ల డిప్యూటీ సేనాని విస్నూరు దేశముఖ్ రామ చంద్రారెడ్డి నిరంకుశంపై కడవెండి ప్రజలు సాగించిన పోరాటం. దొడ్డి కొమురయ్య అమరత్వంతో రైతాంగ సాయధ పోరాటంగా మారింది. దున్నేవారికి భూమి అంశాన్ని ప్రధాన ఎజెండా గా మార్చింది. దొరను వారి తొత్తులను ఎదిరించి బలైన బందగీ, చాకలి ఐలమ్మ భూ పోరాటం దావానంలా సంస్థానమంతా వ్యాపించింది.
సాంఘిక ఆర్థిక అంశాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే పిలుపుకు అత్యంత ధైర్య సాహసాలతో కడవెండి గ్రామం ఉద్యమ భూకంప కేంద్రంగా మారింది. – అస్నాల శ్రీనివాస్
1938 హరిపుర జాతీయ కాంగ్రెస్ సమావేశం “రాచరిక రాష్ట్రాలు భారత్ లో అంతర్భాగమని తీర్మానించింది. దీని ప్రేరణతో కమ్యూనిస్ట్ ల పోరుకు సమాంతరంగా సంస్థాన స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం పలు కార్యక్రమాలు నిర్వహించింది. పౌర హక్కులు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కోసం సత్యాగ్రహాలు నిర్వహించింది. స్వామి రామానంద తీర్థ ,బూర్గుల రామకృష్ణారావు ,పి వి నరసింహారావు, రంగారావు వంటి వారు నాయకత్వం వహించారు. పోరాటకారులను తల్లులు ఎలా కాపాడుకున్నారో తాను రాసిన గొల్ల రామవ్వ కథలో పివి దృశ్యమానం చేసారు. ఆదివాసీ తల్లులు సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంకు ఎలా ఉతమయ్యారో మల్లు స్వరాజ్యం తన ఆత్మ కథ నా గొంతే తుపాకీ లో తెలియచేసారు.
1938 హరిపుర జాతీయ కాంగ్రెస్ సమావేశం “రాచరిక రాష్ట్రాలు భారత్ లో అంతర్భాగమని తీర్మానించింది. దీని ప్రేరణతో కమ్యూనిస్ట్ ల పోరుకు సమాంతరంగా సంస్థాన స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం పలు కార్యక్రమాలు నిర్వహించింది. – అస్నాల శ్రీనివాస్
కమ్యూనిస్ట్ , స్టేట్ కాంగ్రెస్ నిరంతర పోరాటాల వలన స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని నెహ్రూతో సెప్టెంబర్ 29,1947 లో యాదాతథ స్థితి ఒప్పందం కుదుర్చుకున్న నిజాం రాజు బలహీనమయ్యాడు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ గెరిల్లాలు 3వేల గ్రామాలను విముక్తి చేసి పరిపాలన కమిటీలు వేసాయి. పది లక్షల ఎకరాల భూమిని పంచాయి. స్త్రీల పై ,నిమ్న వర్గాల పై దాడులు వివక్షత తగ్గాయి. కమ్యూనిస్ట్ ల పోరు ఉధృతం అవ్వడం, రజాకార్ల ఆగడాలు మితిమీరి పోవడంతో భారత ప్రభుత్వం సైనిక చర్య సెప్టెంబర్ 13,1948 లో ప్రారంభించింది. 17 సెప్టెంబర్ నాటికి నిజాం హైద్రాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యింది .
కమ్యూనిస్ట్ గెరిల్లాలు 3వేల గ్రామాలను విముక్తి చేసి పరిపాలన కమిటీలు వేసాయి. పది లక్షల ఎకరాల భూమిని పంచాయి. – అస్నాల శ్రీనివాస్
ఈ సైనిక చర్యలో అరాచక రజాకార్ల ను అణచివేయడం జరిగింది. రాచరిక రద్దు పోరులో అగ్రగామిగా ఉన్న, సాయుధ పోరాటాన్ని విరమించని కమ్యూనిస్ట్ లపై , రైతులపై సైన్యం దాడులకు పాల్పడిన అపశృతి అనాడు జరిగింది. ఈ సంఘటనకు అ తర్వాత కాంగ్రెస్ తన విచారాన్ని వ్యక్తం చేసింది.కమ్యూనిస్ట్ పార్టీ జరిపిన సాయుధ పోరును స్వాతంత్రోద్యమంలో భాగమని,అంతకు మించిన గొప్ప సామాజిక మార్పు కారక ఉద్యమమని,కుల మతాలకు అతీతంగా ఐక్యమయ్యి కొనసాగిన సంస్కరణ ఉద్యమమని గుర్తించి గౌరవించి ఉద్యమకారులకి పెన్షన్స్ ఇచ్చింది.
రజాకార్ల ఆగడాలు మితిమీరి పోవడంతో భారత ప్రభుత్వం సైనిక చర్య సెప్టెంబర్ 13,1948 లో ప్రారంభించింది. 17 సెప్టెంబర్ నాటికి నిజాం హైద్రాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యింది .– అస్నాల శ్రీనివాస్
ఈ ఉద్యమం ఇచ్చిన ఫలితాలు, చర్చకు దారి తీసిన అనేక అంశాలు జాతీయ కాంగ్రెస్ పరిపాలన తాత్వికతను మరింత సుసంపన్నం చేసాయి. సామ్యవాద సమాజ స్థాపన కాంగ్రెస్ లక్ష్యమని 1955 అవద్ సమావేశం తీర్మానించింది. తెలంగాణలో భూదానోద్యమం నిర్వహించిన వినోభా భావే
భూసంస్కరణలు అమలు చేయకపోతే కమ్యూనిస్ట్ ల నాయకత్వంలో మహా విప్లవం రక్తపాత ఉద్యమం దేశమంతా జ్వలిస్తుందని గాంధీ నెహ్రూ లకు నివేదిక ఇచ్చాడు. ఫలితంగా రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చబడ్డాయి. అలాగే ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక చట్టాలు చేయబడ్డాయి.పి వి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణ చట్టాల రూపకల్పన జరిగి దేశానికి ఒక మార్గం ఏర్పర్చారు. మట్టి మనుషులు నిర్వహించిన ఈ పోరు అందించిన మరొక అంశం.. పాలనలో ప్రజల భాగస్వామ్యం. ఈ ప్రేరణతో రాజ్యాంగంలో 73,74 రాజ్యాంగ సవరణ చట్టాలతో గ్రామ నగర పంచాయత్ వ్యవస్థలు ఏర్పడ్డాయి.
పాలనలో ప్రజల భాగస్వామ్యం – ఈ ప్రేరణతో రాజ్యాంగంలో 73,74 రాజ్యాంగ సవరణ చట్టాలతో గ్రామ నగర పంచాయత్ వ్యవస్థలు ఏర్పడ్డాయి. – అస్నాల శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ ఈ విలీన నేపథ్య చారిత్రాత్మక ఉద్యమాన్ని, ఉద్యమకారులను త్యాగాలను సదాస్మరణలో, స్ఫూర్తిదాయకంగా ఉండడానికి,నూతన తరాలు భాద్యతాయుతంగా ఉండడానికి అనేక చర్యలు తీసుకుంది. నిజాం రాచరిక కాలంలో తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిలబడిన జయ సూర్య పేరుతో హోమియో కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టిన గడ్డ కోసం అన్నం పెట్టిన భూమి కోసం ఇంటిని పోరాట కేంద్రంగా మార్చిన అగ్ని కణిక ఐలమ్మ . భీమ్ రెడ్డి నల్లా నరసింహ దేవులపల్లి వంటి వీరయోధులను సాకిన తల్లి ఐలమ్మ . ఈ అవ్వ పాత్ర చిరస్మరణీయంగా ఉండడం కోసం సి యం రేవంత్ రెడ్డి మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును పెట్టారు. ప్రకృతి వనరులు అవి సమాజ ఉమ్మడి ఆస్తులు, వాటిని రక్షించడమే ప్రథమ కర్తవ్యం అని చాటి చెప్పిన పోరాటం ప్రేరణతో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవకుండా హైడ్రా ను ప్రభుత్వం నిర్వహిస్తున్నది .భాషా సంస్కృతుల పరిరక్షణ ఉద్యమ ఆధ్యుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వ విద్యాలయానికి పెట్టనున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరుకు నాటి రైతాంగ ఉద్యమం చోదక శక్తిగా స్పూర్తిగా ఉత్ప్రేరకంగా పని చేసిందని గత టి ఆర్ యస్ ప్రకటించింది. ఆ ఉద్యమ అమరుల జయంతి వర్ధంతులను అధికారికంగా ప్రకటించింది .
మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును, భాషా సంస్కృతుల పరిరక్షణ ఉద్యమ ఆధ్యుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వ విద్యాలయానికి పెట్టనున్నది. – అస్నాల శ్రీనివాస్
నాటి ఉద్యమంలో మహిళలు చూపిన దీక్ష ,ప్రతిఘటన అసమానవైనవి .తొలినాళ్లలో పోరాటకారులకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన మహిళలు తమ పాత్రను పెంచుకుని సాయుధ దళ సభ్యులుగా దళ నేతలుగా పని చేసారు .హింసను ప్రతిఘటించే క్రమంలో తుపాకులను పేల్చడం బాంబులు విసరడం నేర్చుకున్నారు.దాడులు ఆత్మ రక్షణ లో శిక్షణ ఇచ్చిన మోటూరు ఉదయం లలితమ్మ ,దళాలలో చురుకైన పాత్ర పోషించిన వజ్రమ్మ నాగమ్మ స్వరాజ్యం ఆరుట్ల కమలమ్మ ,దళాలకు వైద్య సేవలు అందించిన అచ్చమాంబ రజియా లాంటి వేలాది మహిళలు ఈ పోరాటంలో వెన్నుదన్నుగా నిలిచారు.తమ పై ఏన్ని అఘాయిత్యాలు జరిగిన వెనుకడుగు వేయలేదు .సమాజంలో సగ భాగమైన మహిళలు మరియు పురుషులు కలసి నిర్వహించిన విలీన ఉద్యమ స్పూర్తితో మహిళల వికాసం కోసం ,రక్షణ కోసం పలు పనులను చేపట్టింది. వివక్షలను అంతం చేయటంలో విద్యా కీలక సాధనమని భావిస్తున్నది .శ్రమ గౌరవ జ్ఞాన నైపుణ్య పాఠాలు ,లింగ సమానత్వం ఆచరించే విద్యా ప్రణాళికను,శ్రామిక మహిళా శక్తి ఉత్పాదక రంగంలో పెంచడానికి సి యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పలు పాలన సంస్కరణలను రూపొందిస్తున్నది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా సిలిండర్ సబ్సిడీ ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళా సాధికారత,స్వయం స్వాలంబన దిశగా కొనసాగుతున్నారు.
ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా సిలిండర్ సబ్సిడీ, ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళా సాధికారత, స్వయం స్వాలంబన దిశగా కొనసాగుతున్నారు. – అస్నాల శ్రీనివాస్
మహోన్నత ఉదాత్త అంశాలతో కొనసాగిన హైద్రాబాద్ విలీన ఉద్యమాన్ని ఆర్ యస్ యస్ బి జె పి విచ్చిన్న శక్తులు మసి పూసి మారేడుకాయ చేస్తున్నాయి .జాతీయోద్యమంలో కానీ ,నిజాం సంస్థానంలో జరిగిన ప్రజల విముక్తి కోసం జరిగిన ఏ పోరాటంలో పాలు పంచుకొని ఈ మతోన్మాద శక్తులు ఉద్యమ ఇతివృత్తాన్ని వక్రీకరిస్తున్నాయి . బందగీ షోయభూల్లా ఖాన్ వంటి అనేక ముస్లిం యోధుల త్యాగాలను అపహాస్యం చేస్తూ ప్రజల ఐక్యతకు చిచ్చు పెట్టే రాజకీయాలను చేస్తున్నది .ఫాసిజం అమలు చేస్తూ సమాజపు ఆస్తులను కార్పోరేట్లకు ధారాదత్తం చేస్తున్నది.జాతి భాషా సాంస్కృతిక ఆధిపత్య ధోరణులతో బహుళత్వ స్ఫూర్తిని బలహీనపరుస్తున్నది.ఇలాంటి ధోరణులు శక్తులను ఈ తెలంగాణ నేల ఈసడించుకునే వారసత్వాని కల్గిఉన్నది.ఈ స్పూర్తిని దేశానికి అందించడంలో మనం అగ్రగామిగా కదలడమే నాటి రైతాంగ విముక్త ,, హైద్రాబాద్ విలీన పోరాటకారులకు మనం ఇచ్చే ఘనమైన నివాళి.
వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం